Mumbai Boat Fire : మంటల్లో చిక్కుకున్న చేపల బోట్..చిక్కుకున్న 20 మంది మత్స్యకారులు

ముంబై సమీపంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ భారీ మంటల్లో చిక్కుకుంది...

Mumbai Boat Fire : మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలో సముద్రంలో మత్స్యకారులు ప్రయాణిస్తున్న ఓ పడవ మంటల్లో చిక్కుకుంది. దాదాపు 18-20 మంది మత్స్యకారులు చేపల వేటకోసం బోటులో బయల్దేరి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య పడవలో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. చేపల వేటకు సముద్రంపై పడవలో జాలర్లు ప్రయాణించే సమయంలో హఠాత్తుగా పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి.

Mumbai Boat Fire Incident

ముంబై(Mumbai) సమీపంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ భారీ మంటల్లో చిక్కుకుంది. దాదాపు 80 శాతం పడవ కాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో 18-20 మంది జాలర్లు పడవలో ఉన్నారు. బోటు చుట్టుతా నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానిక జాలర్లు చూసి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జాలర్లను కాపాడారు. పడవను ఒడ్డుకు చేర్చి మంటలను ఆర్పివేసినా అప్పటికే చాలావరకూ కాలిపోయింది.

బోటు 80శాతం కాలిపోయినా అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు లేకుండా అధికారుల సాయంతో తృటిలో తప్పించుకోగలిగారు జాలర్లు. అగ్నిప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పడవలో ఉన్న చేపల వల మంటలకు వ్యాప్తికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.

Also Read : Ex MP Gorantla Madhav : మరికొన్ని కొత్త చిక్కుల్లో పడ్డ వైసీపీ మాజీ ఎంపీ

Leave A Reply

Your Email Id will not be published!