IPL Auction 2022 : ఐపీఎల్ వేలంలో ఊహించని రీతిలో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. ఆర్చర్ ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్లకు చేజిక్కించుఉంది. రెండో రోజు వేలం పాటలో ఆసక్తికర పరిణామాలు(IPL Auction 2022 )చోటు చేసుకున్నాయి.
విండీస్ బ్యాటర్ రోవ్ మన్ పావెల్ ను ఢిల్లీ క్యాపిట్స్ రూ 2.8 కోట్లకు తీసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వాయ్ ను చెన్నై సూపర్ కింగ్స్ కోటి రూపాయలకు దక్కించుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ చివరి వరకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. ఆసిస్ ఆటగాడు డేనియల్ సామ్స్ ముంబై ఇండియన్స్ రూ. 2.6 కోట్లకు దక్కించుకుంది.
పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండరర్ రిషి ధావన్ రూ. 55 లక్షలు, ఫిన్ అలెల్ ను రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీ రూ. 80 లక్షలకు తీసుకుంది.
ఇక ఆల్ రౌండర్ రాజ్ వర్దన్ హంగర్గేకర్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేయగా అండర్ 19 టీమ్ కెప్టెన్ యశ్ ధుల్ ను రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ చేజిక్కించుకుంది.
స్పిన్నర్ యశ్ దయాల్ ను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ రూ. 3 .2 కోట్లకు కొనుగోలు చేసింది. సిమ్ రాజీత్ సింగ్ ను రూ. 20 లక్షలకు తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ . ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్ రూ. 40 లక్షలు పలికాడు.
మరో ఆల్ రౌండర్ తిలక్ వర్మను రూ. 1.70 కోట్లకు ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 65 లక్షలకు లలిత్ యాదవ్ ను దక్కించుకుంది. మ్రోర్ ను ఆర్సీబీ రూ. 95 లక్షలకు కొనుగోలు చేసింది.
అనుకూల్ రాయ్ ను కేకేఆర్ రూ. 20 లక్షలకు తీసుకుంది.ఒడియమ్ స్మిత్ ను పంజాబ్ కింగ్స్ రూ. 6 కోట్లకు , మార్కో జాన్సన్ ను ఎస్ ఆర్ హెచ్ రూ. 4.20 కోట్లకు, శివమ్ దూబేను సీఎస్కే రూ. 4 కోట్లకు తీసుకుంది. కె. గౌతమ్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 90 లక్షలకు తీసుకుంది.
Also Read : రహానేకు ఛాన్స్ పుజారాకు షాక్