IPL Teams Security : ఐపీఎల్ జ‌ట్ల‌కు భారీ భ‌ద్ర‌త

ఆట‌గాళ్ల‌కు ఫుల్ సెక్యూరిటీ

IPL Teams Security : ఐపీఎల్ -2022 రిచ్ లీగ్ సంద‌ర్భంగా ముంబైలో పూర్తిగా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసింది. ఒక ర‌కంగా గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఈసారి మ‌రింత సెక్యూరిటీ పెంచారు.

ఆట‌గాళ్లు విడిది చేసిన హొట‌ళ్ల ద‌గ్గ‌ర‌, వారు ఆట ఆడే స్టేడియం వ‌ద్ద‌కు చేరుకునేంత వ‌ర‌కు వాహ‌నాల‌కు ఫుల్ సెక్యూరిటీ (IPL Teams Security)క‌ల్పించ‌నున్నారు.

ప్లేయ‌ర్ల‌తో పాటు సిబ్బందిని తీసుకు వెళ్లే బ‌స్సుల కోసం గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డ‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ల్లు ముంబై పోలీసు ఉన్న‌తాధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

దాదాపు రెండు నెల‌ల‌కు పైగా జ‌రిగే ఈ మెగా రిచ్ లీగ్ పోటీ కి క‌నీవిని ఎరుగ‌ని రీతిలో భ‌ద్ర‌త క‌ల్పించామ‌న్నారు.

స‌మ‌యానికి ఆడేందుకు, ప్రాక్టీస్ చేసేందుకు, ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేందుకు సెక్యూరిటీ వెన్నంటి ఉంటుంద‌న్నారు.

ముంబైలో జ‌రిగే మ్యాచ్ ల కోసం ట్రాఫిక్ పోలీసుల‌తో పాటు 1,100 మంది పోలీస్ సిబ్బందిని నియ‌మించామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా క‌రోనా కార‌ణంగా బీసీసీఐ ఈసారి 74 మ్యాచ్ ల‌ను పూర్తిగా ముంబై లోని నాలుగు స్టేడియంల‌లో నిర్వ‌హిస్తోంది.

ముంబై, పుణెలో జ‌రుగుతాయి. పాల్గొనే 10 జ‌ట్లు వివిధ ప్రాంతాల్లోని హొటళ్ల‌లో బ‌స చేస్తున్నాయి. బ‌స చేసే హోట‌ళ్లు, మైదానాల‌కు మ‌ధ్య దూరం ఎక్కువ‌గా ఉన్నందున ట్రాఫిక్ అంత‌రాయం లేకుండా చేస్తున్నామ‌న్నారు.

ప్ర‌తి టీమ్ కు ఎస్కార్ట్ , సెక్యూరిటీ (IPL Teams Security)ఉంటుంద‌న్నారు. సీఎస్కే తాజ్ ప్యాల‌స్ లో , ఢిల్లీ క్యాపిట‌ల్స్ హోట‌ల్ ట్రెడెంట్ లో ఉంది.

గుజ‌రాత్ టైటాన్స్ ప‌రేల్ లోని ఐటీసీ గ్రాండ్ సెంట్ర‌ల్ లోని జేడ‌బ్ల్యూ మారియ‌ట్ లో ఉండ‌గా స‌హ‌ర్ లో కేకేఆర్ జ‌ట్టు ఉంటోంది.

ల‌క్నో సూప‌ర్ జ‌యింట్స్ తాజ్ వివంత‌లో , ముంబై ఇండియ‌న్స్ లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని హోట‌ల్ ట్రైడెంట్ లో బ‌స చేస్తోంది.

పంజాబ్ కింగ్స్ పొవాయ్ లోని హోట‌ల్ రినైసెన్స్ లో, శాంతాక్రూజ్ లోని గ్రాండ్ హ‌య‌త్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , తాజ్ ల్యాండ్స్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఐటీసీ మ‌రాఠా స‌హార్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ‌స చేస్తోంది.

ఐపీఎల్ మ్యాచ్ ల స‌మ‌యంలో ఆట‌గాళ్ల‌ను త‌ర‌లించేందుకు ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు పోలీస్ సిబ్బంది రెడీగా ఉన్నార‌ని ముంబై పోలీస్ ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ రాజ్వ‌ర్ద‌న్ సిన్హా వెల్లడించారు.

Also Read : ఐపీఎల్ టైటిల్ గెలిస్తే రూ. 20 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!