Murugha Mutt Comment : ‘మురుగ మ‌ఠం’ క‌ల‌క‌లం

కేసుపై కొన‌సాగుతున్న విచార‌ణ

Murugha Mutt Comment : ఏమిటీ మురుగ మ‌ఠం. ఎందుకిలా వార్త‌ల్లో నిలిచింది. అనేది చూస్తే క‌ర్ణాట‌క రాష్ట్రంలోని చిత్ర‌దుర్గ లో ఉంది ఈ మ‌ఠం. మ‌ఠాల‌కు, మ‌ఠాధికాధిప‌తుల‌కు, స్వాములకు పెట్టింది పేరు క‌న్న‌డ ప్రాంతం.

ఇక్క‌డ మ‌ఠాలే కీల‌క పాత్ర పోషిస్తాయి. దీనికి మ‌ఠాధిప‌తిగా శివ‌మూర్తి ఉన్నారు. ఆయ‌న‌పై కేసు న‌మోదు కావ‌డంతో ఒక్క‌సారిగా

మురుగ మ‌ఠం (Murugha Mutt) క‌ల‌క‌లానికి దారి తీసింది. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఓ యువ‌తిని బ్లాక్ మెయిల్ చేశార‌ని, ఐదేళ్ల పాటు లైంగిక వేధింపుల‌కు గురి చేశారంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ మ‌ఠాధిప‌తి అత్యంత శ‌క్తివంత‌మైన స్వామిగా పేరొందారు.

శివ మూర్తి రాష్ట్ర‌, జాతీయ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌తో అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. మ‌ఠంలో చ‌దువుతున్న బాలిక‌లు స్వామి వారి లీల‌ల‌పై భ‌గ్గుమ‌న్నారు.

చిత్ర‌దుర్గ‌లో పోలీస్ స్టేష‌న్ ఉన్నా మ‌ఠాధిప‌తి ప్ర‌భావం కార‌ణంగా త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని భావించి వారంతా క‌లిసి మైసూర్ కు వెళ్లారు. దీంతో మ‌ఠానికి చెడ్డ పేరు వ‌చ్చింది.

ప్ర‌ముఖ మ‌ఠంగా పేరొందింది చిత్ర‌దుర్గ‌లో. ఈ మ‌ఠంలో  పాఠ‌శాల‌లు, కాలేజీలు కొన‌సాగుతున్నాయి. గ‌త కొంత కాలంగా బాలిక‌ల‌పై లైంగిక వేధింపుల‌కు

పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోపిస్తూ బాధిత బాలిక‌లు మైసూర్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ క‌మిటినీ ఆశ్ర‌యించారు.

మ‌ఠాధిప‌తి అయిన స్వామీజీతో పాటు న‌లుగురిపై పోక్సో కేసు న‌మ‌దైంది. స్వామీజీ మొద‌టి ముద్దాయి కాగా హాస్ట‌ల్ వార్డెన్ ర‌ష్మీ రెండో ముద్దాయిగా చేర్చారు. వేలాది మంది బాలిక‌లు చ‌దువుతు్నారు.

మ‌ఠం పేరుతో, మ‌ఠాధిప‌తి పేరుతో, స్వామీజీ పేరుతో బాలిక‌లపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించారు. చిత్ర‌దుర్గలో త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని భావించి తాము ఇక్క‌డి వ‌చ్చామ‌ని బాధిత బాలిక‌లు వాపోయారు.

ఓడ నాడి సేవా సంస్థ ప్ర‌తినిధుల‌ను ఆశ్ర‌యించారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీకి ఫిర్యాదు చేశారు. ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఈ కేసును మైసూరు నుంచి చిత్ర‌దుర్గ‌కు బ‌దిలీ చేశారు.

అయితే హాస్ట‌ల్ వార్డెన్ ర‌ష్మీ త‌మ‌ను తీసుకు వెళ్లి స్వామీజీ వ‌ద్ద వ‌దిలి వెళ్లేవార‌ని ..క‌ష్టాలు తెలుసుకుని లైంగికంగా వేధిస్తున్నారంటూ వాపోయారు. ప్ర‌సాదంలో మ‌త్తు మందు క‌లిపి రేప్ చేశారంటూ ఆరోపించారు.

బాధితులు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీనిపై సీఎం బొమ్మై స్పందించారు. కేసు ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని ఈ స‌మ‌యంలో కామెంట్ చేయ‌డం మంచిది కాద‌ని పేర్కొన్నారు.

మొత్తంగా గ‌త కొంత కాలంగా పేరు ప్ర‌తిష్ట‌లు ఆపాదించుకున్న మురుగ మ‌ఠం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చకు దారి తీయ‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా కొంద‌రు కావాల‌ని చేస్తున్న దుష్ప్ర‌చారం త‌ప్ప ఇంకేమీ లేద‌ని, త్వ‌ర‌లోనే నిజాలు వెలుగు చూస్తాయ‌ని మ‌ఠం నిర్వాహ‌కులు చెబుతున్నారు.

మ‌తం, రాజ‌కీయం ఏక‌మైన ఈ స‌మ‌యంలో వాస్త‌వం వెల్ల‌డి అవుతుందా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌.

Also Read : మ‌ఠాధిప‌తి లైంగిక కేసులో నో కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!