PM Narendra Modi: ప్రధాని మోదీకి ముస్లిం కళాకారుల స్పెషల్ గిఫ్ట్

ప్రధాని మోదీకి ముస్లిం కళాకారుల స్పెషల్ గిఫ్ట్

PM Narendra Modi : పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతికార చర్యగా భారత్ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసిన భారత భద్రతా బలగాలు వాటిని నేల మట్టం చేసాయి. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈనేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీకి(PM Narendra Modi) ఆగ్రాలోని ముస్లిం కళాకారుల బృందం ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ తయారుచేసింది. ఆగ్రాలోని ఆరుగురు సభ్యుల బృందం రాతి చిత్రపటాన్ని తయారుచేసిందని అధికారులు తెలిపారు.

ఈ రాతి చిత్రపటం… ‘‘ఈ కళాకృతి రెండున్నర అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పు ఉంది. బెల్జియం, బర్మా, శ్రీలంక నుంచి సేకరించిన రాళ్లను దీని తయారీకి ఉపయోగించాము. తాజ్‌మహల్‌లో కనిపించే క్లిష్టమైన రాతిని పొదిగే కళ లాగే దీన్ని కూడా జాగ్రత్తగా తయారు చేశాము’ అని కళాబృందానికి నాయకత్వం వహించిన ఇస్రార్‌ తెలిపారు. ‘మేము పాకిస్థాన్‌కు గుణపాఠంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor) గౌరవార్థం ఒక కళాకృతి తయారు చేయాలి అనుకున్నాము. త్వరలోనే ప్రధానిని కలిసి దీన్ని బహూకరించే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని కళాకృతిని తయారు చేయించిన అద్నాన్‌ షేక్‌ పేర్కొన్నారు.

PM Narendra Modi – ఆపరేషన్‌ సిందూర్‌ లో పాక్‌ ఆట కట్టించిన 3వేల మంది అగ్నివీరులు

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌ను ‘ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)’తో చావు దెబ్బకొట్టింది భారత సైన్యం. శత్రుదేశం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఎక్కడికక్కడ అడ్డుకుంది. అయితే, ఈ ఆపరేషన్‌లో అగ్నివీరులు కీలక పాత్ర పోషించినట్లు తాజాగా తెలిసింది. ఆర్మీలోని కీలక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో పనిచేసిన వీరు శత్రు దాడిని సమర్థంగా ఎదుర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఒక్కో గగనతల రక్షణ వ్యవస్థ యూనిట్‌లో దాదాపు 150-200 మంది చొప్పున మొత్తంగా దాదాపు 3000 మంది అగ్నివీరులు ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో పాల్గొన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. వీరంతా సరిహద్దుల్లో పలు కీలక సైనిక స్థావరాలు, ఎయిర్‌బేస్‌ల్లో విధులు నిర్వర్తించారు. సాధారణ సైనికులకు సరితూగుతూ ఉద్రిక్తతల సమయంలో ముందుండి పోరాట పటిమ చూపించారు. పాక్‌ క్షిపణులు, డ్రోన్లను ఎప్పటికప్పుడు నేల కూలుస్తూ సమర్థంగా విధులు నిర్వర్తించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. గన్నర్లు, ఫైర్‌ కంట్రోల్‌ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లు, క్షిపణులు-గన్స్‌ అమర్చిన భారీ వాహనాలకు డ్రైవర్లుగా అగ్నివీరులు ఆపరేషన్‌ లో పాల్గొన్నట్లు తెలిపాయి.

2022 జూన్‌లో కేంద్రం అగ్నివీర్‌ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కింద అగ్నివీరులుగా నియమితులయ్యే సిబ్బంది నాలుగేళ్లపాటు సాయుధ బలగాల్లో పనిచేస్తారు. ఆ తర్వాత 25శాతం మందిని ఎంపిక చేసి 15 ఏళ్ల కాలవ్యవధితో రెగ్యులర్‌ సర్వీసుల్లోకి తీసుకుంటారు. అలా గత మూడేళ్ల నుంచి ఇప్పటివరకు సైన్యంలోకి దాదాపు లక్ష మంది అగ్నివీరులను తీసుకున్నారు. ఈ పథకం అప్పట్లో రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. అయితే, తాజా ఆపరేషన్‌లో ఈ అగ్నివీరులే కీలకపాత్ర పోషించినట్లు కథనాలు వెలువడుతుండటంతో.. దీనిపై రాజకీయ చర్చకు ముగింపు పడే అవకాశం ఉన్నట్లు ఆర్మీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read : Lieutenant Governor Manoj Sinha: పాక్ దాడుల బాధితులపై జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక ప్రకటన

Leave A Reply

Your Email Id will not be published!