Rinku Singh : నా తండ్రి కష్టమే ఆడేలా చేసింది
కేకేఆర్ క్రికెటర్ కామెంట్స్
Rinku Singh Inspiration : ఐపీఎల్ 16వ సీజన్ లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక పోరులో గుజరాత్ టైటాన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. ఒకానొక దశలో ఓటమి అంచుల్లో ఉన్న ఆ జట్టును తన అద్భుతైమన ఇన్నింగ్స్ తో ఒడ్డున పడేశాడు. విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు యువ క్రికెటర్ రింకూ సింగ్(Rinku Singh Inspiration). ఆఖరి ఓవర్ లో ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా 5 సిక్సర్లు కొట్టాడు. దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు.
రింకూ సింగ్ తండ్రి సిలిండర్లను హోమ్ డెలివరీ చేస్తాడు. అన్న ఆటో రిక్షా నడుపుతాడు. స్వీపర్ గా పని చేశాడు. కేవలం 9వ తరగతి వరకు మాత్రమే చదివాడు. కానీ క్రికెట్ మీద అతడికి ఉన్న ఆసక్తి, అభిరుచి ఇవాళ అరుదైన క్రికెటర్ గా , ఛేజర్ గా, కింగ్ మేకర్ గా మారేలా చేసింది. దేశమంతటా రింకూ పేరు మారు మ్రోగుతోంది. కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రింకూ సింగ్ 48 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. యూపీలోని అలీఘర్ కు చెందిన రింకూ సింగ్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. నా తండ్రి చాలా కష్ట పడ్డాడు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేల నుండి కొట్టిన ప్రతి బంతి నా కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తులకు అంకింత చేస్తున్నానని చెప్పాడు రింకూ సింగ్(Rinku Singh).
Also Read : రింకూ నువ్వే నా హీరో