N Chandra Babu Naidu : ఏపీ మంత్రుల‌పై బాబు సెటైర్లు

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు

N Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ క‌న్వీన‌ర్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. శ‌నివారం ఆయ‌న ఏపీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్ర‌ధానంగా మంత్రుల‌పై సెటైర్లు విసిరారు. ఉద‌యం లేచింది మొద‌లు రాత్రి వ‌ర‌కు నన్ను తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు. సాక్షి నుంచి ఓ ప్ర‌త్యేక నోట్ వ‌స్తుంద‌ని, దానిని చూసి చ‌ద‌వ‌డ‌మే మంత్రుల ప‌ని అని మండిప‌డ్డారు.

అక్ర‌మ మైనింగ్ కు పాల్ప‌డుతున్న వారికే మంత్రి ప‌ద‌వి క‌ట్టబెట్టారంటూ ఆరోపించారు చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu). సొంత ఊళ్ల‌ల్లో పిల్ల కాల్వ త‌వ్వ లేని వ్య‌క్తి నీటి పారుద‌ల శాఖ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం 10 ఇళ్లు క‌ట్ట‌లేని నాయ‌కుడికి హౌసింగ్ మంత్రిగా కేటాయించారంటూ పేర్కొన్నారు.

పెట్టుబ‌డులు గురించి అడిగితే కోడి గుడ్డు గురించి చెప్పే వ్య‌క్తి ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి అయ్యాడంటూ మండిప‌డ్డారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కు కోర్టుల్లో అనుకూల తీర్పులు రావాల‌ని హిందూ దేవాల‌యాల సొమ్ముతో యాగాలు చేసే వ్య‌క్తి దేవాదాయ శాఖ మంత్రిగా కొలువు తీర‌డం ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు చేసుకున్న దౌర్భాగ్య‌మ‌ని పేర్కొన్నారు.

రైతు బ‌జార్ల‌ను తాక‌ట్టు పెట్టిన వ్య‌క్తి ఆర్థిక శాఖ మంత్రి అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. పిల్ల‌ల జీవితాల‌ను నాశ‌నం చేసే వ్య‌క్తి విద్యా మంత్రిగా ఎలా ప‌ని చేస్తారంటూ ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తీ ఎక్క‌డికి పోద‌ని , నిర్మాణాన్ని ప‌రుగులు పెట్టిస్తాన‌ని అన్నారు.

Also Read : Akunuri Murali : దొర పాల‌న‌లో భూములు అన్యాక్రాంతం

Leave A Reply

Your Email Id will not be published!