Najam Sethi PCB Chief : పీసీబీ చీఫ్ రమీజ్ ఔట్ సేథికి ఛాన్స్
ఆమోదించిన ప్రదాని షెహబాజ్ షరీఫ్
Najam Sethi PCB Chief : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రజాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన పాకిస్తాన్ క్రికెట్ లో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ఏరికోరి వద్దన్నా రమీజ్ రజాను పీసీబీ చీఫ్ గా నియమించారు. అయిష్టంగానే ఒప్పుకున్నాడు.
కొన్ని మార్పులు తీసుకు రావాలని ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో చైర్మన్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా భారత్ పట్ల ఆయన అనుసరించిన వైఖరి మరింత విమర్శలకు దారి తీసింది. ఇదే సమయంలో జట్టు ఎంపికలో సరిగా వ్యవహరించ లేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్లు సైతం రమీజ్ రజా ఒంటెద్దు పోకడపై మండిపడ్డారు. ఆయన వల్లే పీసీబీ తన దారిని వదిలి పెట్టిందంటూ ఆరోపించారు. ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడయ్యాడో ఆనాడే పీసీబీ చీఫ్ నుంచి రమీజ్ రజాను తొలగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది.
కానీ కొంత ఆలస్యం అయ్యాక ప్రస్తుత ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఉన్నట్టుండి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం అధికారంగా వెల్లడించింది ప్రభుత్వం. రమీజ్ రజాను తొలగిస్తూ నజామ్ సేథీకి(Najam Sethi PCB Chief) బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవి నుంచి రమీజ్ రజాను తొలగిస్తున్నట్లు తెలిపింది.
ఇంగ్లండ్ తో జరిగిన మూడు టెస్టుల సీరీస్ లో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. దీంతో రమీజ్ రజాను తొలగిస్తారని ప్రచారం జరిగింది. ఈ సమయంలో వేటు పడడం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా 2021లో రమీజ్ రజా పీసీబీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
Also Read : పాక్ కు షాక్ ఇంగ్లండ్ క్లీన్ స్వీప్