Nalini Sriharan Release : చెరసాలను వీడిన నళిని శ్రీహరన్
రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదీ
Nalini Sriharan Release : భారత దేశ మాజీ ప్రధాని , దివంగత రాజీవ్ గాంధీ దారుణ హత్య కేసులో జీవిత ఖైదుగా ఉన్న ఆరుగురిని సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఇదిలా ఉండగా 30 ఏళ్ల తర్వాత నళిని శ్రీహరన్(Nalini Sriharan Release) జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఆమె కంటతడి పెట్టారు.
తాను చేసిన పనికి పశ్చాతాపం వ్యక్తమైంది మోములో. పెరోల్ షరతులలో భాగంగా తన ఉనికిని గుర్తించేందుకు ఆమె ఇవాళ ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులు 31 ఏళ్ల జైలు శిక్ష తర్వాత సుప్రీంకోర్టు విడుదల చేసిన మరుసటి రోజు ఆరుగురిలో ఒకరైన నళిని శ్రీహరన్ సాయంత్రం వేలూరు జైలుకు వెళ్లి లాంఛనాలను పూర్తి చేసి విడుదల చేశారు. మేలో ఏడవ దోషి పెరారివాలన్ ను విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించింది.
ఇదే ఉత్తర్వు మిగిలిన దోషులకు కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. దోషులను విడుదల చేయాలని కోరుతూ ఎంకే స్టాలిన్ సారథ్యంలోని ప్రభుత్వం 2018లో గవర్నర్ రవికి సిఫార్సు చేసింది. దానికి గవర్నర్ కట్టుబడి ఉన్నారని సుప్రీంకోర్టు పేర్కొంది.
నళినితో పాటు 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన వారిలో నళిని శ్రీహరన్ , సంతన్ , మురుగన్ , రాబర్ట్ పాయస్ , ఆర్పీ రవిచంద్రన్ ఉన్నారు.
Also Read : భారత్ సూపర్ పవర్ ఖాయం – గోయల్