Namita Piparaiya : ‘యోగా నామా’ అందానికి చిరునామా
అందంతో పాటు యోగా ముఖ్యం
Namita Piparaiya : ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి. యోగాను సాధన చేయాలి. మరి నేర్పే వారు ఎవరైనా ఉన్నారా అంటే వేలాది మంది భారత దేశంలో ఉన్నారు. ఎవరికి వారే తమ తమ పద్దతుల్లో యోగాసనాలు వేస్తూ యోగా గురువులుగా చెలమణి అవుతున్నారు. కానీ ఒకరు మాత్రం మరింత పాపులర్ గా మారి పోయారు . ఆమె ఎవరో కాదు యోగా గురువుగా , వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు నమితా పిపరయ్య(Namita Piparaiya).
యోగాతో పాటు ఆయుర్వేదానికి సంబంధించిన జీవన శైలి స్పెషలిస్ట్. యోగనామా వ్యవస్థాపకురాలు కూడా. ఆమె స్థాపించిన యోగానామా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నిత్యం యోగాసనాలతో నేర్పిస్తారు. ఎలా ఉండాలో కూడా చెబుతారు చాలా అందంగా నమితా.
ఆమెకు అపారమైన అనుభవం గడించారు. అంతకు ముందు నమితా పిపరయ్య సిటీ బ్యాంక్ , అవివా , జెనరాలి వంటి ఎంఎన్సీ కంపెనీలలో సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశారు. వెల్ నెస్ జర్నీలో భాగంగా హఠ యోగాలో 700 గంటలకు పైగా యోగా అలయన్స్ సర్టిఫైడ్ శిక్షణను పొందారు. అదే ఆమెకు ఒక ఉపకరణగా, కొత్తగా స్టార్టప్ కంపెనీని స్థాపించేలా చేశారు. ఎవరైనా అనుకుంటారా యోగాకు కూడా ఇంతలా మార్కెట్ ఉంటుందని.
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ద సంస్థలు, ఉపాధ్యాయుల నుండి ప్రాణాయామం , ఆయుర్వేదం , యోగా ఫిలాసఫీని కూడా అభ్యసించారు. విద్యా పరంగా ఢిల్లీ యూనివర్శిటీలో చదివారు.
సింబయాసిస్ నుండి ఫైనాన్స్ , మార్కెటింగ్ లో ఎంబీఏ చేశారు నమితా పిపరయ్య(Namita Piparaiya). హర్యానాలో పెరిగి. తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. తనకు ఉన్న బరువును ఎలా తగ్గించు కోవాలనే దానిపై ఫోకస్ పెట్టి చివరకు యోగా నామాను స్థాపించేలా చేసిందంటారు. యోగాకు కార్పొరేట్ లుక్ కల్పించిన నమితా ఇవాళ సక్సెస్ ఫుల్ ఉమెన్.
Also Read : రచయిత్రిగా మార్చిన అభిరుచి