Balakrishna RIP Tarakaratna : తారకరత్న అంటే బాలయ్యకు ప్రాణం
చివరి దాకా అబ్బాయితోనే బాబాయ్
Balakrishna RIP Tarakaratna : తన కళ్ల ముందు పెరిగిన పిలగాడు నందమూరి తారకరత్న. అతడంటే పంచ ప్రాణం నందమూరి బాలకృష్ణకు. నారా లోకేశ్ పాదయాత్రలో సొమ్మసిల్లి పడి పోయినప్పటి నుంచి చనిపోయేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు బాలకృష్ణ. కానీ దేవుడు దయ చూపలేదు. బాబాయ్ నుంచి అబ్బాయిని దూరం చేశాడు. గత 23 రోజుల నుంచి ఆరోగ్యం బాగుండాలని ఆస్పత్రిలోనే ఉన్నారు. అన్నీ తానై చూసుకున్నారు. చివరి దాకా తనతోనే ఉండి పోయారు నందమూరి బాలకృష్ణ.
స్వంత కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించాడు. ప్రాణం కంటే మిన్నగా వాడికి ఏమీ కాదంటూ నమ్మకంతో ఉన్నారు. నందమూరి తారకరత్న బాగుండాలని పూజలు కూడా చేశాడు బాలయ్య బాబు. కానీ ఫలితం లేక పోయింది. సుదీర్ఘ కాలం పాటు మృత్యువుతో పోరాడారు తారకరత్న. పరిస్థితి విషమించడంతో వైద్యులు శనివారం మరణించినట్లు ప్రకటించారు. ఇవాళ మహాశివరాత్రి పర్వదినం. ఈ పండుగ రోజు నందమూరి తారకరత్న శివైక్యం చెందారు.
తరలి రాని తీరాలకు వెళ్లి పోయాడు. బాలకృష్ణ తారకరత్న ఇక లేడని (Balakrishna RIP Tarakaratna) తలుచుకుని కంటతడి పెట్టారు. చిన్న పిల్లాడిలా ఏడ్చారు. తన ముందు పెరిగిన బిడ్డ తనకు కాకుండా పోతాడని ఊహించ లేదని వాపోయాడు. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో తారకరత్న మరణంతో తీవ్ర విషాదం నెలకొంది.
జనవరి 27న లోకేష్ యుగవగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తారకరత్న పాల్గొన్నారు. నడుస్తూనే కుప్పకూలారు. అక్కడి నుంచి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. చివరకు ప్రాణాలు వదిలారు.
Also Read : తారకరత్న మరణం తీరని విషాదం