Nara Chandrababu Naidu: అసంతృప్తులకు చంద్రబాబు ఫోన్ ! అభ్యర్ధులకు సహకరించాలని సూచన !
అసంతృప్తులకు చంద్రబాబు ఫోన్ ! అభ్యర్ధులకు సహకరించాలని సూచన !
Nara Chandrababu Naidu: బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు(Nara Chandrababu Naidu)… మొదటి జాబితాలోని అసంతృప్త నేతలతో ఫోన్ లో మట్లాడారు. రాష్ట్ర, పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీట్ల కేటాయింపు, అభ్యర్ధుల ఎంపిక జరిగిందని… దీనిని నాయకులు అర్థం చేసుకొని ఉమ్మడి అభ్యర్ధులతో కలిసి పనిచేసి పార్టీను గెలిపించాలని కోరారు. మొదటి జాబితాలో ఉన్న 12 నియోజకవర్గాల అసంతృప్త నేతలతో చంద్రబాబు స్వయంగా మాట్లాడి ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.
Nara Chandrababu Naidu Word
యర్రగొండపాలెంలో పార్టీ నేతలు మన్నె రవీంద్ర, ఎరిక్సన్ బాబు ఇద్దరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పార్వతీపురం నియోజకవర్గంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ జగదీశ్ కు ఫోన్ చేసి విజయచంద్రను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. నంద్యాలలో ఫరూక్ కు సహకరించాలని బ్రహ్మానందరెడ్డికి సూచించారు. కల్యాణదుర్గంలో సీటు దక్కించుకున్న సురేంద్రబాబుకు పూర్తి సహకారం అందించాలని ఉమామహేశ్వరనాయుడు, హనుమంతరాయ చౌదరిలను ఆదేశించారు. కురుపాం నేత దత్తి లక్ష్మణరావుతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. పార్టీ అభ్యర్థి టీ జగదీశ్వరి గెలుపునకు కృషి చేయాలన్నారు.
పార్టీ కోసం పనిచేయాలని చిత్తూరు జిల్లా నేత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్‌కు సూచించారు. ఉంగుటూరు ఇన్‌ఛార్జి గన్ని వీరాంజనేయులు, పిఠాపురం వర్మ, పోలవరం బొరగం శ్రీనివాస్, నర్సాపురం పొత్తూరి రామరాజు, కాకినాడ రూరల్‌లో పిల్లి సత్యనారాయణమూర్తి, తాడేపల్లిగూడెం వలవల బాబ్జీలతో మాట్లాడారు. పొత్తులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు పనిచేయాలని నేతలకు వివరించారు. సీటు దక్కని ప్రతి ఒక్కరికీ పార్టీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు మాట్లాడటంతో పార్టీ కోసం పనిచేస్తామని నేతలు స్పష్టం చేశారు.
Also Read : Kesineni Nani: చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు !