Nara Lokesh: ఉపాధ్యాయ బదిలీలపై అభిప్రాయాలు కోరిన మంత్రి లోకేశ్‌

ఉపాధ్యాయ బదిలీలపై అభిప్రాయాలు కోరిన మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంతో కీలక పాత్ర పోషించిన వారిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకరు. 2019 ఎన్నికలకు ముందు టీచర్స్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా… వారిని రావాల్సిన నెలవారి జీతాన్ని కూడా సకాలంలో చెల్లించడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమయింది. దీనికి తోడు ప్రభుత్వ ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద కాపాలాగా వేయడంతో వారి మనోభావాలు మరింత దెబ్బతిని… 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు.

అదే సమయంలో ఉపాధ్యాయులను తమవైపు ఆకర్షించుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి కూడా వరాల జల్లు కురిపించింది. అందులో ప్రధానమైనది ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం. గత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టాన్ని తీసుకువస్తామని అప్పట్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు.

Minister Nara Lokesh Comments

ఈ నేపథ్యంలో ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)… ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా చేపట్టేందుకు బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం-2025ను ఆన్‌ లైన్‌ లో అందుబాటులో ఉంచామని తెలిపారు. దీనిపై విలువైన అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. తద్వారా విద్యా ప్రమాణాలను పటిష్ఠం చేయడంపై దృష్టి సారించామని మంత్రి తెలిపారు. https://cse.ap.gov.in/documents/DRAFT_TTA_2025_AP.pdf డాక్యుమెంట్‌ను పంచుకున్న ఆయన.. సూచనలు, అభిప్రాయాలను మార్చి 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు draft.aptta2025@gmail.comకి పంపాలన్నారు.

Also Read : TTD : తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌ గా ప్రకటించండి – కేంద్రానికి టీటీడీ ఛైర్మన్‌ లేఖ

Leave A Reply

Your Email Id will not be published!