Nara Lokesh : సీమ ప్రజలకు ఆత్మ గౌరవం ఎక్కువ
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Nara Lokesh : అధికార పార్టీ అడ్డగోలుగా దాడులకు పాల్పడుతోంది. అయినా పట్టించుకోం. ఎందుకంటే మాకు ప్రజా బలం ఉంది. వాళ్లు రాజారెడ్డి రాచరిక పాలన సాగిస్తున్నారు. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ఉండేది ఇంకా కొన్ని రోజులే. అంతిమంగా అధికారంలోకి వచ్చేది తామేనంటూ స్పష్టం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh).
యువ గళం పేరుతో ఆయన చేపట్టిన పాద యాత్ర 119 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నారా లోకేష్ రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మిషన్ రాయలసీమ పేరుతో కడప రాజ రాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద సదస్సు చేపట్టారు. పలువురు అడిగిన ప్రశ్నలకు తాపీగా సమాధానం ఇచ్చారు.
రాబోయే ఐదేళ్లలో తాము ఏం చేస్తామనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వేధింపులకు గురి చేస్తోందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది త్వరలోనే ఓట్ల రూపంలో తేలుతుందన్నారు నారా లోకేష్.
సీమ ప్రజలకు ఆత్మ గౌరవం ఎక్కువ. చంద్రబాబు నాయుడు వచ్చాక అది తగ్గింది. రాయలసీమ అంటే సెల్ ఫోన్ కంపెనీ, కియా కార్లు, మామిడి పళ్లు గుర్తుకు వస్తాయన్నారు. మిగతా జిల్లాలకు ధీటుగా రాయలసీమ జిల్లాలను అభివృద్ది చేస్తామన్నారు నారా లోకేష్. ఇంటికి ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇవ్వడం గొప్ప సంస్కృతి అని కొనియాడారు.
Also Read : Jyotiraditya Scindia : వచ్చే 5 ఏళ్లలో 200 ఎయిర్ పోర్ట్ లు