Nara Lokesh : అధికారంలోకి వస్తే జీవోలు రద్దు – లోకేష్
స్పష్టం చేసిన టీడీపీ ప్రధాన కార్యదర్శి
Nara Lokesh : తాము గనుక అధికారంలోకి వస్తే వెంటనే ఏపీ సర్కార్, సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను పునః సమీక్షిస్తామన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara lokesh). తీసుకు వచ్చిన జీవోలను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఆయన చేపట్టిన యువ గళం పాదయాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పవర్ లోకి వచ్చిన వెంటనే ఆటో నగర్ ల అభివృద్దికి, ట్రాన్స్ పోర్ట్ రంగం అభివృద్దికి ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని చెప్పారు నారా లోకేష్.
Nara Lokesh Promiss for Development
ఆటో నగర్ లను నాశనం చేస్తూ జగన్ తీసుకు వచ్చిన జీవోలను రద్దు చేస్తామన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. సగం భూమిని కొట్టేయాలని తీసుకు వచ్చిన జీవోలు అత్యంత ప్రమాదకరమన్నారు. గ్రీన్ ట్యాక్స్ , పెట్రోల్, డీజిల్ ట్యాక్స్ తగ్గిస్తామని స్పష్టం చేశారు. ఆటోనగర్లు, ట్రాన్స్ పోర్టు రగంగంపై ఆధారపడిన వారిని , కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్.
రాష్ట్రంలో రాజా రెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రజలకు ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత ఏపీ సీఎంకే దక్కుతుందన్నారు . ప్రజలు భరించే స్థితిలో లేరన్నారు. వారి అంచనాలు తప్పడం ఖాయమని, తాము పవర్ లోకి వస్తామని జోష్యం చెప్పారు.
Also Read : Jailer Record : ఓవర్సీస్ లో జైలర్ సూపర్