Jailer Record : ఓవ‌ర్సీస్ లో జైల‌ర్ సూప‌ర్

స‌రికొత్త రికార్డు బ్రేక్ చేసిన ర‌జ‌నీ

Jailer Record : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జైల‌ర్ రికార్డుల మోత మోగిసింది. ఆగ‌స్టు 10న విడుద‌లైన ఈ చిత్రం అంచ‌నాల‌కు మించి వ‌సూళ్ల‌ను సాధించింది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , త‌మ‌న్నా భాటియా, శివ రాజ్ కుమార్ , మోహ‌న్ లాల్ , యోగి బాబు, ర‌మ్య కృష్ణ న‌టించారు. ప్ర‌ధానంగా త‌లైవా న‌ట‌న‌, మేన‌రిజం, డైలాగులు ఈ సినిమాకు క‌లెక్ష‌న్లు తీసుకు వ‌చ్చేలా చేశాయి.

Jailer Record Breaking

ఇక ఓవ‌ర్సీస్ లో సైతం ర‌జ‌నీ జైల‌ర్(Jailer) విస్తు పోయేలా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 20 ఇలియ‌న్ డాల‌ర్ల‌ను క్రాస్ చేసింది. అంటే భార‌తీయ రూపాయ‌ల్లో రూ. 166.31 కోట్లు . రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డుల మోత మోగిస్తుందో వేచి చూడాలి. ఇక భార‌త్ లో ఇప్ప‌టి వ‌ర‌కు అన్నింటిని క‌లుపుకుని ర‌జ‌నీకాంత్ జైల‌ర్ చిత్రం ఏకంగా రూ. 500 కోట్లు కొల్ల‌గొట్టింది.

ఇది కూడా ఓ చ‌రిత్రే. ఇక ర‌జ‌నీకాంత్ త‌న సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది జైల‌ర్ మూవీ. మ‌రో వైపు మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ బోల్తా ప‌డింది. నిర్మాత అనిల్ సుంక‌ర‌కు భారీ న‌ష్టం వాటిల్లింది. ఇక ర‌జనీకాంత్ త‌న చిత్రం స‌క్సెస్ కావ‌డంతో ఫుల్ సంతోషంగా ఉన్నారు.

Also Read : Chandrababu Vision 2047 Comment : బాబు ‘విజ‌న్’ గ‌ట్టెక్కిస్తుందా

Leave A Reply

Your Email Id will not be published!