Narayan Jagadeesan : నారాయణ్ జగదీశన్ సెన్సేషన్
దేశీవాళి క్రికెట్ లో భారీ స్కోర్ రికార్డ్
Narayan Jagadeesan : దేశీవాళీ క్రికెట్ లో ఘనమైన చరిత్ర నమోదైంది. ఏకంగా 506 పరుగుల భారీ స్కోర్ చేయడం విస్తు పోయేలా చేసింది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడు జట్టు చుక్కలు చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తమిళనాడు 50 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 506 రన్స్ చేసింది.
ఇందులో భాగంగా ఓపెనర్ నారాయణ్ జగదీశన్(Narayan Jagadeesan) రెచ్చి పోయాడు. చుక్కలు చూపించాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. మొత్తం స్కోర్ లో జగదీశన్ వే అత్యధిక పరుగులు ఉన్నాయి. మొత్తం మ్యాచ్ లో భాగంగా 141 బాల్స్ మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 25 ఫోర్లు 15 సిక్సర్లు ఉన్నాయి.
ఒక్కడే జగదీశన్ 277 పరుగులు చేయడం విశేషం. మరో ప్లేయర్ సాయి సుదర్శన్ కూడా సెంచరీ చేశాడు. 102 పరుగులు చేశాడు. ఇందులో 19 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. నారాయణ్ జగదీశన్ , సాయి సుదర్శన్ కలిసి మొదటి వికెట్ కు ఏకంగా 416 పరుగులు చేశారు. ఇక మ్యాచ్ లో భాగంగా పలు రికార్డులు నమోదయ్యాయి.
దేశీవాళిలో అత్యధిక స్కోర్. వన్డే లో ఒక ఆటగాడు ఇన్ని పరుగులు చేయడం కూడా చరిత్రే. అంతకు ముందు భారీ స్కోర్ చేసిన వారిలో బ్రౌన్ 268 రన్స్ చేస్తే ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 264 రన్స్ చేసి మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉండగా విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటి వరకు నారాయణ్ జగదీశన్(Narayan Jagadeesan) దుమ్ము రేపాడు. ఏకంగా ఏడు సెంచరీలు చేసి విస్తు పోయేలా చేశాడు.
Also Read : ‘సూర్య’ భాయ్ ని తట్టుకోవడం కష్టం – కేన్