Narayana Murthy : మాజీ ప్రధానిపై నారాయణ మూర్తి కామెంట్స్
ఇన్ఫోసిస్ చైర్మన్ సంచలన కామెంట్స్
Narayana Murthy : ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి(Narayana Murthy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాన మంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన పాలన అద్భుతంగా కొనసాగిందని కానీ బారత ఆర్థిక వ్యవస్థ అంతగా ఆకట్టుకోలేదన్నారు ఇన్ఫోసిస్ చైర్మన్ . తాను హెచ్ఎస్బీసీని 2012లో విడిచి పెట్టినప్పుడు భారత దేశం పేరు ప్రస్తావనకు రాలేదని చెప్పారు.
కానీ చైనా పేరు 30 సార్లు తీసుకోబడిందన్నారు. కానీ ప్రధానిగా మోదీ కొలువు తీరాక సీన్ మారిందన్నారు. ప్రస్తుతం భారత దేశం అసాధారణమైన దేశంగా పేరు పొందిందన్నారు.
ఓ వైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఉన్నా అభివృద్ది చెందిన దేశాల సరసన భారత్ నిలిచి ఉండడం సామన్యమైన విషయం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో భారత్ కు ఒక గౌరవ ప్రదమైన స్థానం ఉందని స్పష్టం చేశారు నారాయణ మూర్తి(Narayana Murthy).
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో సింగ్ ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక పోయిందన్నారు ఐటీ దిగ్గజం ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోయాయన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ లో యువ పారిశ్రామికవేత్తలు ,విద్యార్థులతో జరిగిన చర్చలో పాల్గొన్నారు నారాయణ మూర్తి.
వరల్డ్ లోనే భారత్ ను రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనాకు పోటీదారుగా మార్చవచ్చన్నారు. చైనాకు బదులు భారత్ ను ప్రస్తావించేలా చేయాల్సిన బాధ్యత యువకులపై ఉందన్నారు ఇన్ఫోసిస్ చైర్మన్.
Also Read : ఉద్యోగులు వారానికి మూడుసార్లు రావాలి- టీసీఎస్