PM Modi : మహిళల సహకారం దేశాభివృద్ధికి సోపానం
మహిళా సాధికారతపై ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi Nari Shakti : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల గౌరవం స్థాయిని పంచడం ద్వారానే భారత దేశం ముందుకు సాగుతుందన్నారు. మహిళలు లేకుంటే దేశం లేదన్నారు మోదీ(PM Modi Nari Shakti). ఈ ఏడాది యూనియన్ బడ్జెట్ లో మహిళల అభివృద్దికి ప్రయారిటీ ఇవ్వడం జరిగిందని చెప్పారు. దేశం పురోగమించాలంటే మహిళల పట్ల మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు పీఎం. ఈ బడ్జెట్ ప్రభుత్వ ప్రయత్నాలకు కొత్త ఊపు ఇస్తుందన్నారు.
2047 నాటికి వికాసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు దోహద పడుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు ప్రధాన మంత్రి. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో మహిళల సారథ్యంలోని అభివృద్ది దార్శనికతతో ముందుకు సాగిందన్నారు.
ఇంకా అన్ని రంగాలలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ. వాళ్లు లేకుండా ఏదీ ముందుకు సాగదన్నారు. వారితో కలిసి ప్రయత్నం చేస్తే మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. మహిళల ఆర్థిక సాధికారతపై బడ్జెట్ అనంతర వెబ్ నార్ ను ఉద్దేశించి శుక్రవారం ప్రధానమంత్రి(PM Modi) మాట్లాడారు.
మహిళల గౌరవం, సమానత్వ భావన స్థాయిలను పెంచడం ద్వారా మాత్రమే భారత దేశం ముందుకు సాగుతుందని మరోసారి స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. మహిళలు, సోదరీమణులు, కూతుళ్లందరి మార్గంలో వచ్చే ప్రతి అవరోధాన్ని తొలగించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రతి రంగంలో మీదైన ముద్ర కనబర్చేందుకు కృషి చేయాలని కోరారు ప్రధాన మంత్రి.
Also Read : మహిళా బిల్లు కోసం పోరాటం – కవిత