AI Generated : ఏఐ చిత్రాలు నెట్టింట్లో హల్ చల్
నటాలీ పోర్ట్ మన్ టు స్కార్లెట్ జాన్సన్
AI Generated : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)(AI Generated) టెక్నాలజీని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే కీలక మార్పులు చోటు చేసుకోవడంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. తాజాగా హాలీవుడ్ లో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న నటులు నటాలీ పోర్ట్ మన్ నుంచి స్కార్లెట్ జాన్సన్ కు సంబంధించిన ఏఐ చిత్రాలు భారత దేశంలో దుమ్ము రేపుతున్నాయి. సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణంలో వీరంతా నిమగ్నమై ఉన్నాయని తెలియ చేశాయి.
ప్రధానంగా ఏఐ ద్వారా రూపొందించబడిన చిత్రాలు ఇంటర్నెట్ ను కుదిపేస్తున్నాయి. కళాకారులు ఆకర్షణీయమైన ఫలితాలను అందుకునేందుకు అనేక రకాలుగా ఏఐని ఉపయోగిస్తున్నారు. ఓ కళాకారులు ప్రసిద్ద హాలీవుడ్ సెలబ్రిటీలను భారతదేశం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణంలో మళ్లీ ఊహించు కునేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ)ని ఉపయోగించారు.
ఇన్ స్టాగ్రామ్ లో భాగస్వామ్యం చేయబడిన వాటిలో వైల్డ్ ట్రాన్స్ స్కార్లెట్ జాన్సన్ , ఎమిలీయా క్లార్క్ , నటాలీ ఫోర్ట్ మన్ , జెండయా, సల్మా హాయక్ , జెన్నిఫర్ లారెన్స్ , జెన్నిఫర్ అనిస్టన్ , చార్లెజ్ థెరాన్ , ఏంజెలినా జోలీ, ఎమ్మా వాట్సన్ లతో సహా హాలీవుడ్ నటీమణుల ఏఐ రూపొందించిన చిత్రాలను పోస్ట్ చేశారు.
Also Read : S Jai Shankar : ప్రపంచం భారత్ పక్షాన నిలిచింది