National Comment : నరేంద్ర మోదీ రియల్ టార్చ్ బేరర్
ప్రధాన మంత్రికి బీజేపీ లైన్ క్లియర్
National Comment : నరేంద్ర మోదీ మోస్ట్ పవర్ ఫుల్ లీడర్. ఇది జగమెరిగిన సత్యం. ఆయన ఎక్కువగా మాట్లాడడు. కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఎవరిని ఎలా సంబోధించాలో ఇంకెవరిని ఎక్కడ ఉంచాలో మోదీకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు.
భారత దేశ రాజకీయ చరిత్రలో ఇప్పుడు మోదీ శకం నడుస్తోంది. అవునన్నా కాదన్నా ఒప్పుకుని తీరాల్సిందే. మహా మహులు, రాజకీయంలో తలపండిన నాయకులు, అతిరథ మహారథులు ఇప్పుడు మోదీ ముందు మోకరిల్లే స్థాయికి వచ్చారు.
నాయకుడిని ఎవరూ తయారు చేయరు. తానే ప్రజల నుంచి పుట్టుకు వస్తాడు. భారత దేశ సుదీర్ఘ రాజకీయాలలో దూకుడు కలిగిన ప్రధానులలో ఒకరు ఇందిరా గాంధీ అయితే మరొకరు నరేంద్ర దామోదర దాస్ మోదీ(Narendra Modi).
ఆయన చరిష్మా ముందు కాషాయమే కాదు ప్రతిపక్ష పార్టీలు సైతం విస్తు పోతున్నాయి. ఆయన అనుసరిస్తున్న స్ట్రాటజీ వేరు. ఎన్నో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు గాక.
కానీ దేశానికి దిశా నిర్దేశం చేయడంలో తను అనుకున్నది 133 కోట్ల భారతీయులకు చేరవేయడంలో మోదీని మించిన కమ్యూనికేటర్ ఎవరూ లేరు.
ప్రస్తుతం భారత్ లో(National Comment) అత్యంత సానుకూల వాతావరణం పాదుకొల్పిన ఘనత ఆయనదే. ఇక మోదీ త్రయంపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా నవ్వుకుంటూ తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ పోవడంలో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు మోదీ.
ఇందులో ఆయన సక్సెస్ అయ్యారు. ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్న సినీ డైలాగ్ కచ్చితంగా మోదీకి సరి పోతుంది.
ట్రబుల్ షూటర్ అమిత్ షా చెప్పినట్టు రాబోయే కాలానికి కూడా మోదీనే మా సారథి అని ప్రకటించాడంటే అర్థం మోదీ రియల్ టార్చ్ బేరర్ అని అర్థం అవుతుంది కదూ.
Also Read : అంబానీ..అదానీలకు సపోర్ట్ అబద్దం