NATO Chief : చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన నాటో

ఉక్రెయిన్ కు సైన్యాన్ని పంప‌లేం

NATO Chief : ర‌ష్యా ఏక‌ప‌క్షంగా ఉక్రెయిన్ పై దాడుల‌కు పాల్ప‌డ‌డంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. భారీ ఎత్తున బాంబుల మోత మోగుతోంది. మిస్సైళ్ల‌తో బెంబేలెత్తిస్తోంది.

ఈ త‌రుణంలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భ‌వ‌నాలు ధ్వంసం అయ్యాయి. ప‌లు చోట్ల చ‌ని పోయిన వారితో వాతావ‌ర‌ణం దారుణంగా ఉంది. ద‌య‌నీయంగా ఉంది.

ప్ర‌స్తుతం ఐక్య రాజ్య స‌మితి, నాటో తో పాటు ప‌లు దేశాలు ర‌ష్యాను యుద్దం ఆపాల‌ని కోరినా ప‌ట్టంచు కోలేదు ఆ దేశ అధ్య‌క్షుడు పుతిన్. ఈ త‌రుణంలో ఇప్ప‌టి దాకా ఉక్రెయిన్ దేశ అధ్య‌క్షుడు త‌మ‌కు నాటో కూట‌మి స‌పోర్ట్(NATO Chief) చేస్తుంద‌ని ఆశించారు.

కానీ నాటో చీఫ్ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. దీంతో ఉక్రెయిన్ ఒంట‌రిగా మిగిలి పోయింది. ప్ర‌స్తుతం ఉక్రెయిన్ లో ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది.

భార‌త దేశానికి చెందిన 20 వేల మంది విద్యార్థులు చిక్కుకు పోయారు. గ‌గ‌న త‌లం మూసి వేశారు. ఎయిర్ బేస్ మూసి వేశారు. పౌరులు, చిన్నారుల మ‌ర‌ణం క‌లిచి వేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గి మెరుపు దాడుల‌కు దిగింది ర‌ష్యా.

ఈ త‌రుణంలో ర‌ష్యాను ఢీకొనేందుకు అమెరికా భావిస్తోంది. లాత్వేయాకు అమెరికా సైనికుల‌ను పంపిస్తోంది. ప్ర‌స్తుతం ఐక్య రాజ్య స‌మితి అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించింది.

ర‌ష్యాపై ఎదురు దాడికి వ్యూహాలు ర‌చిస్తున్నారు అగ్ర రాజ్యం. ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ ప‌రిస్థితి ఏం చేయాల‌నే దానిపై చ‌ర్చిస్తున్న‌ట్లు నాటో చీఫ్ చెప్పారు ఇవాళ‌.

Also Read : అధ్య‌క్షుడి భావోద్వేగం ప్ర‌పంచం ఆశ్చ‌ర్యం

Leave A Reply

Your Email Id will not be published!