Navjot Singh Sidhu : మహిళా రెజ్లర్లకు సిద్దూ మద్దతు
కేసు నమోదు చేయక పోవడంపై ఫైర్
Navjot Singh Sidhu : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ , పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం సీరియస్ గా స్పందించారు. రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ , భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు 9 మంది మహిళా రెజ్లర్లు.
గతంలో ఫిర్యాదు చేసినా కేంద్రం తుతూ మంత్రంగా ఓ కమిటీని వేసింది. కానీ ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో మహిళా రెజ్లర్ల ఆరోపణలు తప్పని తేల్చడంతో తిరిగి మరోసారి జంతర్ మంతర్ వేదికగా రెజ్లర్లు ఆందోళనకు దిగారు.
అంతే కాకుండా డబ్లుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులను ఆశ్రయిస్తే వాళ్లు పట్టించు కోలేదని వాపోయారు బాధిత రెజ్లర్లు. ఇప్పటి వరకు 1,000 మంది మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది బబితా ఫోగట్. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.
ఈ మేరకు కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ ఢిల్లీ పోలీస్ కు నోటీసు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ఆవేదనను కలిగిస్తోందన్నారు. తాను బాధితుల పక్షాన నిలబడతానని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రెజ్లర్లకు మద్దతుగా హాజరవుతున్నట్లు వెల్లడించారు సిద్దూ(Navjot Singh Sidhu).
Also Read : పీటీ ఉష కామెంట్స్ శశి సీరియస్