NCP Shiv Sena : ఉమ్మ‌డి పోరాటం స‌ర్కార్ పై యుద్దం

మ‌హా వికాస్ అఘాడీ కొన‌సాగింపు

NCP Shiv Sena :  బీహార్ లో చోటు చేసుకున్న ప‌రిణామాలు కొంత ఆస‌క్తిని రేపుతున్నాయి. 17 ఏళ్ల సుదీర్ఘ బంధానికి చెక్ పెట్టారు జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆయ‌న భార‌త‌య జ‌న‌తా పార్టీకి క‌టీఫ్ చెప్పారు.

ప్ర‌తిప‌క్షాలు ఆర్జీడీ, కాంగ్రెస్, సీపీఐఎంఎల్ , త‌దిత‌ర పార్టీల‌తో క‌లిసి మ‌హా ఘ‌ట్ బంధ‌న్ లేదా మ‌హా కూట‌మిని ఏర్పాటు చేశారు. తిరిగి ఎనిమిదో సారి నితీశ్ కుమార్ సీఎం కాగా తేజ‌స్వి యాద‌వ్ డిప్యూటీ సీఎంగా కొలువు తీరారు.

ఈ త‌రుణంలో మ‌హా వికాస్ అఘాడీ స‌ర్కార్ ను శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేల‌తో క‌లిసి బీజేపీ కూల్చేసింది. ఏక్ నాథ్ షిండే , బీజేపీ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది.

గ‌తంలో ఎన్సీపీ, శివ‌సేన‌, కాంగ్రెస్ పార్టీల‌తో క‌లిపి ఎంవీఏగా ఏర్ప‌డ్డాయి. అనుకోని రీతిలో ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల‌న్నీ య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తు ఇస్తే శివ‌సేన(NCP Shiv Sena) ఉన్న‌ట్టుండి మాట మార్చింది.

బీజేపీ నిల‌బెట్టిన ద్రౌప‌ది ముర్ముకు వేసింది. దీంతో కూట‌మి మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌చ్చాయి. తాజాగా ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ బీజేపీ స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా శివ‌సేన పార్టీతో క‌లిసి పోరాడాల‌ని నిశ్చ‌యించారు.

రాబోయే ఎన్నిక‌ల్లో క‌లిసే ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని అనుకుంటున్నారు. ఇదే విష‌యాన్ని మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు కూడా తెలియ చేసిన‌ట్లు టాక్.

ఎన్సీపీ అగ్ర నాయ‌కులు అజిత్ ప‌వార్ , జ‌యంత్ పాటిల్ , ఛ‌గ‌న్ భుజ్ బ‌ల్ , సునీల్ త‌ట్క‌రే శిస‌వేన చీఫ్ ఠాక్రేతో స‌మావేశమై కూట‌మి కొన‌సాగింపుపై చ‌ర్చించారు.

Also Read : మ‌హిళ‌ల‌కు ఆప్ బంప‌ర్ ఆఫర్

Leave A Reply

Your Email Id will not be published!