NCPCR Objects : ఆప్ ఎమ్మెల్యేపై ఎన్సీపీసీఆర్ ఫైర్

ఆదేశించిన జాతీయ బాల‌ల హ‌క్కుల సంఘం

NCPCR Objects : ఆప్ ఎమ్మెల్యే అతిషికి బిగ్ షాక్ త‌గిలింది. పిల్ల‌ల‌ను దుర్వినియోగం చేసినందుకు కేసు న‌మోదు చేయాల‌ని బాల‌ల హక్కుల సంఘం కోరింది. వ్య‌క్తిగ‌త అజెండా కోసం పిల్ల‌ల‌ను దుర్వినియోగం చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కురాలుగా ఉన్నారు. జాతీయ బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది.

భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు మ‌నోజ్ తివారీ దాఖ‌లు చేశారు. ఈ మేర‌కు ఫిర్యాదు చేశారు. ఆప్ అతిషిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఢిల్లీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , పోలీస్ క‌మిష‌న‌ర్ కు లేఖ రాసింది. వ్య‌క్తిగ‌త అజెండా కోసం పిల్ల‌ల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌నే దానిపై చ‌ర్య తీసుకోవాల‌ని ఆదేశించింది.

ఢిల్లీ ఎడ్యుకేష‌న్ టాస్క్ ఫోర్స్ అతిషి సింగ్ ఆదేశాల మేర‌కు పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న మైన‌ర్ పిల్ల‌ల‌ను వారి వ్య‌క్తిగ‌త అజెండాలు , రాజ‌కీయ ప్ర‌చారాల కోసం దుర్వినియోగం చేస్తున్నారంటూ స‌మాచారం అందింద‌ని ఎన్సీపీసీఆర్(NCPCR Objects) తెలిపింది. క‌మిష‌న‌ర్ ను త‌క్ష‌ణ‌మే ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ఈ విష‌యంపై ద‌ర్యాప్తు చేయాల‌ని అభ్య‌ర్థించింది.

ఎక్సైజ్ పాల‌సీ స్కాంలో నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా దృష్టిని మ‌ళ్లించేందుకు , అభిమానం కోసం మైన‌ర్ పిల్ల‌ల‌ను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎన్సీపీసీఆర్ ఆరోపించింది. తివారీ ఫిర్యాదు ఆధారంగా క‌మిష‌న్ ఎడ్యుకేష‌న్ టాస్క్ ఫోర్స్ స‌భ్యులైన శైలేష్ , రాహుల్ తివారీ , మైత్రేయి కాలేజీ చైర్ ప‌ర్స‌న్ వైభ‌వ్ శ్రీ‌వాస్త‌వ్ , త‌రిషి శ‌ర్మ‌ల‌ను కూడా నియ‌మించింది. దీనిపై ఆప్ ఇంకా స్పందించ లేదు.

Also Read : సిసోడియాను వేధిస్తున్న సీబీఐ – ఆప్

Leave A Reply

Your Email Id will not be published!