Draupadi Murmu Sweeps : గుడిని శుభ్రం చేసిన ద్రౌపది ముర్ము
చీపురుతో ఊడ్చిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి
Draupadi Murmu Sweeps : భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ (ఎన్డీయే) ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే ఆలయాన్ని సందర్శించారు.
ఆమెకు శివుడు అంటే వల్లమాలిన అభిమానం. మొదటి నుంచి కష్టాల నుంచి గట్టెక్కి జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు. ఆ తర్వాత కౌన్సిలర్ గా, బీజేపీ మోర్చా అధ్యక్షురాలిగా, మంత్రిగా, గవర్నర్ గా అంచెలంచెలుగా ఎదిగారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం కలిగిన ద్రౌపది ముర్ము బుధవారం తాను నిత్యం ఆరాధించే, కొలిచే శివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం(Draupadi Murmu Sweeps) చేశారు. అనంతరం నందిని మొక్కారు.
గుడి లోపట శివుడిని పూజించారు. ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని మయూర్ భంజ్ జిల్లా లోని రాయ్ రంగ్ పూర్ లో కొలువై ఉంది ఈ ఆలయం. దీనికి ప్రత్యేకత ఉంది.
ఇక్కడ శివుడిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయన్న నమ్మకం ఉంది భక్తులకు. ఇవాళ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము దర్శించు కోవడంతో మరోసారి ఈ గుడి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది. మొత్తం 20 మంది అభ్యర్థులను పరిశీలించింది.
ఈ మేరకు ఒడిశాకు చెందిన ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము(Draupadi Murmu Sweeps) కు అరుదైన అవకాశం దక్కింది. ఇదిలా ఉండగా 64 ఏళ్ల వయస్సు కలిగిన ద్రౌపది మర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే స్వాతంత్రం అనంతరం తొలి ఆదివాసీ మహిళ గా చరిత్ర సృష్టిస్తారు.
Also Read : ముదిరిన సంక్షోభం గౌహతికి చేరిన రాజకీయం