Nepal Earthquake :నేపాల్, బీహార్ లో భారీ భూకంపం..భయంతో జనం పరుగులు

బిహార్‌లో కూడా ఈ భూకంపం ప్రభావం చూడబడ్డది...

Nepal Earthquake : హిమాలయ పర్వత ప్రాంతంలో మళ్లీ భూకంపం సంభవించింది. మన మిత్రదేశం నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ భూకంపం వచ్చింది.

Nepal Earthquake Updates

దీంతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రియాక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైంది. ఆ ప్రకంపనలు మనదేశంలోనూ కనిపించాయి. బిహార్‌లో కూడా ఈ భూకంపం ప్రభావం చూడబడ్డది. అసోంలో భూకంపం వచ్చిన 24 గంటల్లోనే, నేపాల్‌లో మరో భూ ప్రకంపనం రావడం కలవరపెడుతోంది.

హిమాలయ మధ్య ప్రాంతంలోని సింధుపాల్‌చౌక్ జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్‌లో మాత్రమే కాకుండా, భారత్, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాలతో పాటు బిహార్, బెంగాల్, సిక్కింలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.

ఈ పరిస్థితి చూసి ప్రజలు తమ ఇళ్లు, భవనాలు వీడి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : Union Tax Revenue : కేంద్ర సర్కార్ ఇచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు కోత విధించనుందా?

Leave A Reply

Your Email Id will not be published!