Liker Ayci : ఎయిర్ ఇండియా ను టాటా గ్రూప్ సంస్థ టేకోవర్ చేసుకున్నాక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నష్టాల బాట పట్టిన సంస్థను లాభాల దిశగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. టర్కిస్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది.
గత నెలలో ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్న టాటా సన్స్ ఇల్కర్ ఐసీ (Liker Ayci)అభ్యర్థిత్వాన్ని పరిశీలించేందుకు ఎయిర్ లైన్ బోర్డు సమావేశమై అతడి ఎంపికకు ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా సిఇఓ, ఎండీగా తనను నియమించడం పట్ల ఐసీ స్పందించారు. ప్రపంచంలో ఒక దిగ్గజ విమానాయన సంస్థకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉందన్నారు.
ప్రత్యేకించి టాటా గ్రూప్ కు వరల్డ్ వైడ్ గా మంచి పేరుందన్నారు. తనకు ఇవాళ సంతోషంగా ఉంది. గౌరవంగా ఉందన్నారు. ఎయిర్ ఇండియాలోని నా సహోద్యోగులతో ,టాటా గ్రూప్ నాయకత్వంతో సన్నిహితంగా పని చేస్తూ అభివృద్ధి చేస్తానని చెప్పారు.
ప్రపంచ విమానయాన రంగంలో ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం తీసుకు వస్తానని ఈ సందర్బంగా స్పష్టం చేశారు ఐసీ. భారతీయ ఆతిథ్యాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం చేస్తానని అన్నారు.
ఈ సమావేశానికి చైర్మన్ ఎన్ . చంద్రశేఖరన్ ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇల్కర్ ఏవియేషన్ ఇండస్ట్రీ లీడర్. తన పదవీ కాలంలో టర్కిస్ ఎయిర్ లైన్స్ ను విజయం వైపు తీసుకు వెళ్లాడు.
ఎయిర్ ఇండియాను ఆ దిశగా తీసుకు వెళతాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Also Read : టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్