Bihar New Govt : బీహార్ లో కొలువు తీర‌నున్న సంకీర్ణ స‌ర్కార్

ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న నిత‌ష్‌..తేజ‌స్వి

Bihar New Govt :  భార‌తీయ జ‌న‌తా పార్టీకి గుడ్ బై చెప్పిన జేడీయూ బుధ‌వారం ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐఎంఎల్ , త‌దిత‌ర పార్టీల‌తో క‌లిసి నూత‌న సంకీర్ణ ప్ర‌భుత్వం కొలువు తీరనుంది.

రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా మ‌రోసారి జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ , ఉప ముఖ్య‌మంత్రిగా ఆర్జేడీ అగ్ర నేత తేజ‌స్వి యాద‌వ్ ప్ర‌మాణ స్వీకారం చేయనున్నారు.

బీహార్(Bihar New Govt)  రాష్ట్రంలో వేగంగా రాజ‌కీయాలు మారి పోయాయి. సుదీర్ఘ కాలం పాటు సాగిన జేడీయూ, కాషాయ స్నేహానికి పుల్ స్టాప్ ప‌డింది.

ఇదిలా ఉండ‌గా మ‌ధ్యంత‌ర కాలంలో భాగ‌స్వాముల‌ను మార్చ‌డం ద్వారా నితీశ్ కుమార్ ప్ర‌జాస్వామ్య స్పూర్తికి విభాగం క‌లిగించారంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆరోపించింది.

కాగా కొత్త‌గా కొలువు తీరబోయే కూట‌మికి మ‌హా కూట‌మి అని పేరు పెట్టారు నితీశ్ కుమార్, తేజ‌స్వి యాద‌వ్. ఇవాళ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు బీహార్ సీఎంగా ప్ర‌మాణం చేస్తారు.

ఇదిలా ఉండ‌గా ఆ రాష్ట్రానికి ఎనిమిదోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం. తేజ‌స్వి డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం మాత్ర‌మే చేస్తారు.

మిగ‌తా ఎమ్మెల్యేలు మంత్రులుగా త‌ర్వాత ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఏడు పార్టీల మ‌హాఘ‌ట్ బంధ‌న్ (మహా కూట‌మి) తో పాటు ఒక ఇండిపెండెంట్ క‌లిసి ప‌ని చేస్తార‌ని నితీశ్ కుమార్ వెల్ల‌డించారు.

ఆయ‌న ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ కు రాజీనామా స‌మ‌ర్పించారు. కొత్త కూట‌మి ఏర్పాటుపై కూడా విన్న‌వించారు. బీజేపీతో క‌టీఫ్ చేశామ‌ని తెలిపారు.

ఇత‌ర ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఉమ్మ‌డి బ‌లం ఆధారంగా త‌దుప‌రి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు త‌మ‌ను ఆహ్వానించాల‌ని కోరారు.

Also Read : బీజేపీపై మ‌హూవా మోయిత్రా ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!