New Parliament Comment : న‌వ శకం ప్ర‌జా దేవాల‌యం

నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభం

New Parliament Comment : భార‌త దేశ చ‌రిత్ర‌లో సువ‌ర్ణ అధ్యాయం ప్రారంభ‌మైంది. న‌వ శ‌కానికి నాంది ప‌లికింది. సెప్టెంబ‌ర్ 19న మంగ‌ళ‌వారం నూత‌నంగా నిర్మించిన పార్ల‌మెంట్ భ‌వ‌నం మొద‌లైంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తొలి ప్ర‌సంగం చేశారు. 140 కోట్ల భార‌తీయుల త‌ర‌పున గొంతుక‌ను వినిపించే అరుదైన వేదిక ఈ ప్ర‌జా దేవాల‌యం. 75 ఏళ్ల త‌ర్వాత అత్యాధునిక సౌక‌ర్యాల‌తో అద్భుతంగా నిర్మించారు ఈ భ‌వ‌నాన్ని. లోక్ స‌భ‌తో పాటు రాజ్య‌స‌భ కూడా ఇందులో కొలువు తీరాయి. తొలిసారిగా చరిత్రాత్మ‌క‌మైన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ప్ర‌వేశ పెట్టారు. తొలుత రూ. 620 కోట్లు అంచ‌నా వేశారు. ఆ త‌ర్వాత రాను రాను ఖ‌ర్చులు పెర‌గ‌డం బ‌డ్జెట్ కాస్తా రెండింత‌లైంది. రూ. 1200 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశారు నూత‌న పార్ల‌మెంట్ ను నిర్మించేందుకు.

New Parliament Comment Viral

అత్యాధునిక టెక్నాల‌జీని దీని కోసం వాడారు. దేశంలో పేరు పొందిన టాటా గ్రూప్ సంస్థ దీనిని నిర్మించింది. దీనిని మేడ 28, 2023న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు. జి20కి భారత దేశం నాయ‌క‌త్వం వ‌హించిన స‌మ‌యంలో దీనికి శ్రీ‌కారం చుట్ట‌డం విశేషం. కొత్త పార్ల‌మెంట్ కు స్పీక‌ర్ ఓం బిర్లా(Om Birla) పేరు కూడా పెట్టారు. పార్ల‌మెంట్ ఆఫ్ ఇండియా పేరు ఖ‌రారు చేశారు. పాత పార్ల‌మెంట్ భ‌వ‌నానికి 93 ఏళ్ల చ‌రిత్ర ఉంది. పార్ల‌మెంట్ భ‌వ‌నం భార‌త దేశ గౌర‌వానికి, నాగ‌రిక‌త‌కు, సంస్కృతికి ద‌ర్ప‌ణంగా నిలిచింది. కోట్లాది మంది ప్ర‌జ‌ల వార‌స‌త్వానికి ఇది ప్ర‌తీక‌గా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. ప్రాజెక్టులో భాగంగా 2019లో దీని నిర్మాణం ప్రారంభ‌మంది. 2020లో శంకుస్థాప‌న చేశారు ప్ర‌ధాని మోదీ(PM Modi). దీనిపై న‌మోదైన అభ్యంత‌రాల‌ను కోర్టు క్లియ‌ర్ చేసింది. ఇక పాత పార్ల‌మెంట్ ను 1927లో బ్రిటీష్ వాస్తు శిల్పులు స‌ర్ ఎడ్విన్ లుటియ‌న్స్ , స‌ర్ బేక‌ర్ రూపొందించారు.

తాజాగా నిర్మించిన నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం వ‌య‌సు 150 ఏళ్లు. ఇది విదిషా లోని విజ‌య దేవాల‌యాన్ని పోలి ఉండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. లోక్ స‌భ ఛాంబ‌ర్ లో 888 సీట్లు, రాజ్య‌స‌భ‌లో 384 సీట్లు ఉండేలా రూపొందించారు. ఉమ్మ‌డి సెష‌న్ లో ఏక‌కాలంలో 1,272 మంది ఉండేలా తీర్చిదిద్దారు. మొత్తం నాలుగు అంత‌స్తులు ఉన్నాయి. ఈ భ‌వ‌నాన్ని 20,866 చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణం క‌లిగి ఉంది. ఇందులో వెళ్లేందుకు మూడు ప్ర‌వేశాలు ఏర్పాటు చేశారు. వీటిని జ్ఞాన్ ద్వార్ , శ‌క్తి ద్వార్ , క‌ర్మ ద్వార్ అని పేరు పెట్టారు. గ‌జ‌, అశ్వ‌, గ‌రుడ‌, మ‌క‌ర‌, శార్దూల‌, హంస‌ల సంర‌క్ష‌క విగ్ర‌హాలు మూడు ప్ర‌వేశ ద్వారాల వ‌ద్ద కొలువు తీరాయి. త‌మిళ‌నాడు నుంచి రాజ దండం తీసుకు వ‌చ్చారు. మొత్తం మీద కొలువు తీరిన పార్ల‌మెంట్ భ‌వ‌నం..ప్ర‌జా దేవాల‌యం ఇప్పుడు చ‌రిత్ర‌కు ద‌ర్ప‌ణంగా నిలిచింద‌న‌డంలో సందేహం లేదు.

Also Read : Chandrababu Naidu : క్వాష్ పిటిష‌న్ పై తీర్పు రిజ‌ర్వ్

Leave A Reply

Your Email Id will not be published!