NHRC Notice : వాయు కాలుష్యం హ‌క్కుల సంఘం ఆగ్ర‌హం

ఢిల్లీ..యూపీ..పంజాబ్..హ‌ర్యానా కు నోటీసు

NHRC Notice : వాయు కాలుష్యం తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఒక్క పంజాబ్ లోనే 40 ల‌క్ష‌ల హెక్టార్ల‌కు పైగా వ‌రి పంట‌ను సాగు చేశారు. మొత్తం పంట వ్యర్థాల‌ను కాల్చ‌డం ప్రారంభించారు. దీంతో ఆ మొత్తం పొగ దేశ రాజ‌ధాని ఢిల్లీని క‌మ్మేస్తోంది. ప్ర‌మాద‌క‌ర కాలుష్య స్థాయిని దాట‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా ఢిల్లీ ఆప్ స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది.

ఈ మేర‌కు పిల్ల‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేందుకు గాను త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చేంత వ‌ర‌కు ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల‌ను మూసి వేస్తున్న‌ట్లు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. మ‌రో వైపు పంజాబ్ సీఎం రైతుల‌కు అండ‌గా నిలిచారు. వ‌చ్చే ఏడాది ఇలాంటిది మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూస్తామ‌న్నారు.

ఆపై ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను వేసుకునేలా రైతుల‌ను చైత‌న్య‌వంతం చేస్తామ‌ని చెప్పారు. ఇక పెరుగుతున్న కాలుష్య స్థాయిల‌ను త‌నిఖీ చేసేందుకు కేంద్ర కాలుష్య నియంత్ర‌ణ అధికార యంత్రాంగం ఆంక్ష‌లు(NHRC Notice) విధించింది. న‌గ‌రంలో గాలి నాణ్య‌త క్షీణించ‌డంతో జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్హెచ్ఆర్సీ) సీరియ‌స్ గా స్పందించింది.

ఇందులో భాగంగా శుక్ర‌వారం పంజాబ్ , హ‌ర్యానా, ఉత్త‌ర ప్ర‌దేశ్ , ఢిల్లీ ప్ర‌భుత్వాల‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌కులు వెంట‌నే వాయు కాలుష్య నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పష్టం చేసింది. స్కూళ్ల‌ను మూసి వేసే స్థాయికి వ‌చ్చిందంటే ప‌రిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చంటూ పేర్కొంది జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్.

జారీ చేసిన నోటీసుల్లో నివేదిక‌ను రూపొందించాల‌ని ఆదేశించింది. ఏం చ‌ర్య‌లు తీసుకున్నారో తెలియ చేయాల‌ని కోరింది.

Also Read : ఆప్ గుజ‌రాత్ సీఎం అభ్య‌ర్థిగా ఇసుదాన్ గాధ్వీ

Leave A Reply

Your Email Id will not be published!