Nicholas Pooran : విండీస్ కెప్టెన్సీకి నికోల‌స్ పూరన్ గుడ్ బై

ఐసీసీ టి20 లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న

Nicholas Pooran : వెస్టిండీస్ క్రికెట్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది వెస్టిండీస్. దీంతో ఆదిలోనే టోర్నీ నుంచి నిష్క్ర‌మిండంతో తాను కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్నట్లు ప్ర‌క‌టించాడు నికోల‌స్ పూర‌న్.

జ‌ట్టు ఓట‌మికి తాను పూర్తి బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేస్తున్న‌ట్లువ ఎల్ల‌డించాడు. ఊహించ‌ని రీతిలో త‌మ జ‌ట్టు ఆడ లేక పోయింద‌న్నాడు. విచిత్రం ఏమిటంటే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ ను రెండుసార్లు గెలుచుకుంది విండీస్ టీమ్. వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు నికోల‌స్ పూర‌న్.

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో వెస్టిండీస్ ప్రాథ‌మిక గ్రూప్ ద‌శ‌లో కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్ గెలుపొందింది. సూప‌ర్ -12 ద‌శ‌కు అర్హ‌త సాధించ లేక పోయింది. జింబాబ్వే, ఐర్లాండ్ , స్కాట్లాండ్ వంటి జ‌ట్ల‌తో గ్రూప్ లో ఉన్నా విండీస్ జాబితాలో చివ‌రి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండ‌గా కీర‌న్ పొలార్డ్ ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పూర‌న్(Nicholas Pooran) ఈ ఏడాది మేలో వ‌న్డే, టి20 మ్యాచ్ ల‌కు వెస్టిండీస్ కెప్టెన్ గా ఎంపిక‌య్యాడు.

రాజ‌నామా చేసేందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. టి20 ప్ర‌పంచంలో తీవ్ర నిరాశ‌కు గుర‌య్యా. నేనే కెప్టెన్సీ గురించి చాలా ఆలోచించాన‌ని తెలిపాడు. కెప్టెన్ గా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నాడు.

అంకిత భావంతో ఈ పాత్ర‌ను స్వీక‌రించాన‌ని స్ప‌ష్టం చేశాడు నికోలస్ పూర‌న్.  విండీస్ క్రికెట్ బోర్డు పూర‌న్ రాజీనామాపై స్పందించ లేదు.

Also Read : సంజూ శాంస‌న్‌కు ఛాన్స్ ద‌క్కుతుందా

Leave A Reply

Your Email Id will not be published!