Nicholas Pooran : నిప్పులు చెరిగిన పూర‌న్

ఆర్సీబీకి కోలుకోలేని షాక్

Nicholas Pooran : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో రికార్డులు బ‌ద్ద‌ల‌వుతున్నాయి. యువ ఆట‌గాళ్లు రెచ్చి పోతుంటే సీనియ‌ర్ క్రికెట‌ర్లు చుక్క‌లు చూపిస్తున్నారు. భారీ టార్గెట్ లు సైతం వెల వెల బోతున్నాయి. ల‌క్ష్యం ముందు చిన్న బోతున్నాయి.

కేఎల్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు చుక్క‌లు చూపించింది. ఒకానొక ద‌శ‌లో ఓట‌మి పాల‌వుతుంద‌ని అనుకున్న ల‌క్నోకు ఊహించ‌ని రీతిలో విజ‌యాన్ని చేకూర్చేలా చేశాడు విండీస్ స్టార్ క్రికెట‌ర్ నికోల‌స్ పూర‌న్(Nicholas Pooran).

ఒక ర‌కంగా చెప్పాలంటే పూన‌కం వ‌చ్చిన‌ట్టు చెల‌రేగాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. నిన్న కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ గుజ‌రాత్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో ఆఖ‌రి ఓవ‌ర్ లో 5 సిక్స‌ర్లు బాదిన రింకూ సింగ్ ను మ‌రిచి పోక ముందే నికోల‌స్ పూర‌న్ అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. మొత్తం 19 బంతులు ఎదుర్కొన్న పూర‌న్ 4 ఫోర్లు 7 సిక్స‌ర్ల‌తో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని న‌మోదు చేసి రికార్డు బ్రేక్ చేశాడు నికోల‌స్ పూర‌న్.

బెంగ‌ళూరు వేదిక‌గా చిన్న స్వామి స్టేడియంలో జ‌రిగిన కీల‌క పోరులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అసాధార‌ణ‌మైన రీతిలో పోరాట ప‌టిమ‌ను క‌న‌ర్చింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు నిద్ర లేకుండా చేసింది. ఎంతైనా నికోల‌స్ పూర‌నా మ‌జాకా అంటున్నారు ఫ్యాన్స్.

Also Read : రింకూ ఆటకు సుహానా అన‌న్య ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!