Niharika Chaitanya Divorce : నిహారికా చైత‌న్య వీడిన బంధం

విడాకులు తీసుకున్న బంధువులు

Niharika Chaitanya Divorce : మెగా ఫ్యామిలీకి చెందిన నిహారికా కొణిదెల , చైత‌న్య దంప‌తులు విడాకులు తీసుకున్నారు. నిహారిక ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు కూతురు. చైత‌న్య ఓ వ్యాపార‌వేత్త‌కు చెందిన త‌న‌యుడు. వీరిద్ద‌రి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. కానీ ఎందుక‌నో కొంత కాలం నుంచి వీరిద్ద‌రూ విడిగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. దీనికి ఊతం ఇస్తూ ఇద్ద‌రూ విడాకులు కావాలంటూ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. చివ‌ర‌కు కోర్టు వీరిద్ద‌రికీ డిక్రీ మంజూరు చేసింది. కొంత కాలం పాటు కొన‌సాగిన బంధం తెగి పోయింది.

నిహారిక కొణిదెల(Niharika Konidela) న‌టిగా, నిర్మాత‌గా గుర్తింపు పొందారు. కొన్ని చిత్రాల‌లో న‌టించారు. స్వ‌తంత్ర వ్య‌క్తిత్వం క‌లిగిన వ్య‌క్తిగా గుర్తింపు పొందారు. నిహారిక‌, చైత‌న్య‌లు ఇద్ద‌రూ పెద్ద ఎత్తున త‌మ ఫోటోల‌ను పంచుకున్నారు సోష‌ల్ మీడియా వేదిక‌గా. భారీ ఎత్తున ఖ‌ర్చు కూడా చేశారు. అధికారికంగా కూడా విడాకులు కూడా తీసుకున్న‌ట్లు సమాచారం. కాగా ఇద్ద‌రూ ఎందుకు విడి పోవాల‌ని అనుకున్నార‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

మ‌రోవైపు ఈ ఏడాది మార్చి నెల‌లో త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతా నుంచి కొణిదెల నిహారిక‌తో ఉన్న ఫోటోల‌ను పూర్తిగా తొల‌గించాడు. ఇది చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. దీంతో నిహారిక‌తో బంధం తెంచుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. చివ‌ర‌కు అదే నిజ‌మైంది. మొత్తంగా మెగా ఫ్యామిలీలో చిరంజీవి కూతురు కూడా బ్రేక‌ప్ చెప్ప‌డం విశేషం.

Also Read : Anil Kumar Yadav : ద‌మ్ముంటే దా లోకేష్ – అనిల్ కుమార్

 

Leave A Reply

Your Email Id will not be published!