Nagababu : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ నడి బొడ్డున బంజార్ హిల్స్ లోని పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉన్న ర్యాడిన్సన్ బ్లూస్ హోటల్ లోని పుడింగ్ మింక్ పబ్ పై టాస్క్ ఫోర్స్ మాటు వేసి దాడి చేసింది.
నగరంలోని అన్ని పబ్ లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది నగర పోలీస్ శాఖ.
కానీ రూల్స్ కు భిన్నంగా ఈ ఫుడింగ్ పబ్ లో గత కొంత కాలం నుంచి అర్ధరాత్రి 3.30 గంటల దాకా ఓపెన్ చేసి ఉంచడాన్ని గుర్తించింది.
ఇక టాస్క్ ఫోర్స్ జరిపిన ఆకస్మిక దాడుల్లో ఏకంగా 150 మంది పట్టుబడ్డారు. వారిలో 145 మందిని బయటకు పంపించారు.
ఇందులో అంతా ప్రముఖుల పిల్లలే ఉన్నారని ప్రచారం జరిగింది.
విచిత్రం ఏమిటంటే చివరి దాకా ప్రముఖ నటుడు చిరంజీవి తమ్ముడు నాగ బాబు కూతురు కొణిదెల నిహారిక కూడా ఉండడం,
ఆమె మీడియాతో మాట్లాడకుండానే వెళ్లి పోయింది. కొన్ని గంటలకు పైగా ఆమె పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.
పలు అనుమానాలకు తావిచ్చింది. ఇదే సమయంలో కేవలం 142 మంది పేర్లను బయటకు విడుదల చేసింది టాస్క్ ఫోర్స్ . కానీ నిహారిక పేరు అనూహ్యంగా ఆ జాబితా నుంచి తొలగించారు.
ఇది కావాలనే చేశారా లేక ఒత్తిళ్లు ఏమైనా పని చేశాయా అన్నది ఆ దేవుడికే తెలియాలని కొందరు ఆరోపిస్తున్నారు.
ఈ తరుణంలో తన కూతురు నిప్పు అని ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు నాగబాబు(Nagababu).
ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులే చెప్పారని తెలిపారు. మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయొద్దంటూ కోరారు. కాగా ఆమె ఏ తప్పు చేయక పోతే ఎందుకు అర్ధరాత్రి వరకు ఉందనే విషయం మాత్రం చెప్పక పోవడం విడ్డూరంగా ఉంది.
Also Read : విల్ స్మిత్ భారత్ నుంచి నేర్చుకున్నాడా