Falguni Nayar : ఈ కామ‌ర్స్ లో నైకా సంచ‌ల‌నం

రిటైలింగ్ సామ్రాజ్యానికి ఫ‌ల్గుణి రాణి

Falguni Nayar  : భార‌తీయ ఈ కామ‌ర్స్ వ్యాపారంలో నైకా ఓ సెన్సేష‌న్. ఫ‌ల్గుణి నాయ‌ర్ నైకాను (Falguni Nayar )స్థాపించారు. 22 సంవ‌త్స‌రాల అనుభ‌వం క‌లిగి ఉన్నారు. ఆర్థిక సేవ‌ల‌లో గొప్ప విజ‌యాన్ని న‌మోదు చేశారు.

ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో చ‌దివారు. అందం, చ‌ర్మ సంర‌క్ష‌ణ రిటైలింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. నైకా బ్రాండ్ ను నిర్మించ‌డంతో త‌న పేరు దేశం దాటి ప్ర‌పంచానికి విస్త‌రించింది.

అత్యంత శ‌క్తివంత‌మైన వ్యాపార‌వేత్త‌ల‌లో ఫ‌ల్గుణి నాయ‌ర్ నిలిచారు. ఎన్నో అవార్డులు పొందారు. ఎక‌నామిక్ టైమ్స్ ఉమెన్ ఎ హెడ్ పుర‌స్కారం పొందారు. రూ. 100 కోట్ల రూపాయ‌ల నిధుల‌తో నైకా యూనికార్న్ క్ల‌బ్ లోకి ఎంట‌రైంది.

దేశంలోనే అత్యంత ప్ర‌సిద్ధి చెందిన మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌లో ఆమె కూడా ఒక‌రు. ఆమె నిక‌ర ఆస్తుల విలువ ఏకంగా రూ. 1, 300 కోట్ల కు పైమాటే అంటే న‌మ్మ‌గ‌ల‌మా.

ఫల్గుణి నాయ‌ర్ మాటల్లో చెప్పాలంటే తాము ప్రారంభించిన‌ప్పుడు ఇ కామ‌ర్స్ అన్న‌ది అంత పాపుల‌ర్ కాదు. నేను చెప్పినప్పుడు మిగ‌తా వారంతా ఆశ్చ‌ర్యంగా చూశారు.

ఈ సంద‌ర్భంగా తాను ఒక‌టే చెబుతాన‌ని పెద్ద‌గా ఆలోచించండి చిన్న‌గా ప్రారంభించండి అని సూచించారు ఫ‌ల్గుణి నాయ‌ర్(Falguni Nayar ). మ‌హిళ‌ల‌కు సంబంధించిన ప్ర‌ధాన వేదిక నైకా.

ప్రామాణిక‌మైన ఉత్ప‌త్తులు, న‌మ్మ ద‌గిన బ్రాండ్ పేర్ల‌కు ప్ర‌సిద్ది చెందాయి. ప్ర‌పంచ కంపెనీల‌తో నైకా పోటీ ప‌డుతోంది. 2015 నుంచి మ‌హిళ‌ల జీవ‌న శైలి మ్యాగ‌జైన్ ఫెమినా భాగ‌స్వామ్యంతో నైకా ఫెమినా బ్యూటీ అవార్డుల‌ను కూడా ఏర్పాటు చేసింది.

పురుషుల‌కు కూడా ఉప‌యోగ ప‌డేలా చేసింది నైకా. 2008లో ఏర్పాటైన నైకా ఇప్పుడు విస్మ‌రించ‌లేని ప‌దం.

Also Read : క‌ల‌ల‌కు రెక్క‌లు తొడిగిన ‘గుర్నాని’

Leave A Reply

Your Email Id will not be published!