Nikki Haley Announces : అమెరికా అధ్యక్ష రేసులో నేనున్నా
ప్రకటించిన నిక్కీ హేలీ
Nikki Haley Announces : అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్న సమయంలో ఉన్నట్టుండి ట్రంప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ప్రవాస భారతీయ మహిళ నిక్కీ హేలి(Nikki Haley Announces). ఆమె వయస్సు 51 ఏళ్లు. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ గా పనిచేశారు. 2024లో అమెరికాలో జరగబోయే అధ్యక్ష రేసులో తాను కూడా ఉన్నానని ప్రకటించారు. ఈ మేరకు వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఆమె యుఎస్ కు వలస వచ్చిన భారతీయుల కూతురు కావడం విశేషం.
వాషింగ్టన్ లో కొత్త తరం నాయకత్వాన్ని ప్రతిపాదించడం ద్వారా తోటి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను సవాల్ చేయడం చర్చకు దారి తీసింది. తాను వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు నిక్కీ హేలి(Nikki Haley Announces). ఆమె గతంలో ఐక్య రాజ్య సమితికి మాజీ రాయబారిగా పని చేశారు.
కొత్త తరం నాయకత్వానికి ఇది సమయం. ఆర్థిక బాధ్యతను తిరిగి కనుగొనడం, మన సరిహద్దును భద్రపర్చడం , అన్నింటి కంటే మన దేశాన్ని బలోపేతం చేయడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు నిక్కీ హేలి. ప్రస్తుతం నిక్కీ హేలి సౌత్ కరోలినా పట్టణంలోని బాంబెర్గ్ లో నివాసం ఉంటోంది.
76 ఏళ్ల మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ కు తనను తాను ప్రత్యామ్నాయంగా పేర్కొనడంతో ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. నేను భారతీయ వలసదారులకు గర్వ కారణమైన కూతురును. నలుపు కాదు తెలుపు కాదు నేను భిన్నంగా ఉన్నానని తెలిపారు.
Also Read : ‘పులి’ బతికే ఉందనడం అబద్దం