AP Speaker : ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం సంచలన ప్రకటన చేశారు. ఇవాళ కొత్త రూల్ ప్రవేశ పెట్టారు. సభా సమావేశాలను జరగ నీయకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుకుంటున్నారని తెలిపారు.
అంతే కాకుండా శాసనసభలో జరిగే సమావేశాలను పర్మిషన్ లేకుండా సభ్యులు సెల్ ఫోన్లలో (AP Speaker)చిత్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో ఏ సభ్యులైనా సెల్ ఫోన్లు తీసుకు రావద్దంటూ రూలింగ్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు స్పీకర్.
ఇక పై తాము ఇచ్చిన ఈ రూల్ అందరికీ వర్తిస్తుందని చెప్పారు. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలని సభాపతి తమ్మినేని సీతారాం సూచించారు.
మరోసారి సభా సమావేశాలను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్(AP Speaker). సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో ఒక రోజు పాటు మొత్తం 11 మంది తెలుగు పార్టీకి చెందిన సభ్యులను సస్పెన్షన్ విధిస్తూ సీతారం నిర్ణయం తీసుకున్నారు.
ఇక సస్పెండ్ అయిన వారిలో సత్య ప్రసాద్ , చినరాజప్ప, రామ్మోహన్ , అశోక్ , సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వర్ రావు, వెలగపూడి రామకృష్ణలపై వేటు వేశారు.
ఇప్పటికే పలుసార్లు సమావేశాలకు అడ్డంకం కలిగిస్తూ వస్తున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు స్పీకర్. ఇప్పటి వరకు తాము సభా సంప్రదాయాలకు అనుగుణంగా సభను నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు తమ్మినేని సీతారాం
. ప్రజా సమస్యలను , అంశాలను ప్రస్తావించాల్సిన సభ్యులు ఇలా అడ్డు తగడం మంచి పద్దతి కాదని సూచించారు.
Also Read : జగన్ సర్కార్‌పై దేశం సభా హక్కుల ఉల్లంఘన