Sanju Samson Drop : రాణించినా రెండో వన్డేలో సంజూపై వేటు
బీసీసీఐ..శిఖర్ ధావన్..లక్ష్మన్ పై ఆగ్రహం
Sanju Samson Drop : న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు బ్యాటింగ్ కు దిగింది. వర్షం కారణంగా ఆటను నిలిపి వేశారు. టి20 సీరీస్ కు సంజూ శాంసన్ ను(Sanju Samson) పక్కన పెట్టిన మేనేజ్ మెంట్ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో మొదటి వన్డేలో ఛాన్స్ ఇచ్చింది. ఇదే సమయంలో వరుసగా విఫలమవుతూ వస్తున్నా రిషబ్ పంత్ ను కొనసాగిస్తూ వచ్చారు.
దీంతో సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ నిర్వాకంపై ఫ్యాన్స్ , మాజీ క్రికెటర్లు భగ్గుమనడంతో గత్యంతరం లేక ఫస్ట్ వన్డేలో ఛాన్స్ ఇచ్చారు శాంసన్. 36 రన్స్ చేశాడు. ఇదే రిషబ్ పంత్ , సూర్య కుమార్ యాదవ్ రాణించ లేదు. టాస్ ఓడి పోయిన కెప్టెన్ శిఖర్ ధావన్ మీడియాతో మాట్లాడాడు. జట్టులో రెండు మార్పులు చేసిందని చెప్పాడు.
శార్దూల్ ఠాకూర్ కు బదులు దీపక్ చాహర్ , సంజూ శాంసన్ స్థానంలో దీపక్ హూడాకు అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా రిషబ్ పంత్ వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నా ఎందుకు వికెట్ కీపర్ గా కొనసాగిస్తూ వస్తున్నారంటూ నిప్పులు చెరిగారు నెటిజన్లు.
ఫస్ట్ వన్డేలో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ తో కలిసి శాంసన్ 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 38 బంతులు ఆడి 4 ఫోర్లతో 36 రన్స్ చేశాడు. అయినా ఎందుకని రిషబ్ పంత్ ను కొనసాగిస్తూ వస్తున్నారంటూ నిలదీస్తున్నారు.
బీజేపీ ఆఫీసుగా మారి పోయిన బీసీసీఐ నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలమని వారంటున్నారు.
Also Read : రెండో వన్డేలో పంత్ వర్సెస్ శాంసన్