Sanju Samson : మూడో వన్డే లో శాంసన్ కు దక్కని ఛాన్స్
మరోసారి రిషబ్ పంత్ కే ప్రయారిటీ
Sanju Samson : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరోసారి తన కక్ష సాధింపు ధోరణిని బయట పెట్టుకుంది. గత కొంత కాలంగా కేరళ స్టార్ సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నా పక్కన పెడుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. న్యూజిలాండ్ టూర్ కు ఎంపికయ్యాడు.
పాండ్యా సారథ్యంలోని టి20 సీరీస్ లో ఎంపిక కాలేదు. కొన్ని పరిస్థితుల కారణంగా శాంసన్ ను ఎంపిక చేయలేదని బుకాయించాడు హార్దిక్ పాండ్యా. ఇక మూడు వన్డేల సీరీస్ లో భాగంగా మొదటి వన్డేలో మాత్రం ఛాన్స్ ఇచ్చారు సంజూ శాంసన్ కు(Sanju Samson). 38 బంతులు ఎదుర్కొని 36 పరుగులు చేశాడు.
కానీ రెండో వన్డేలో తప్పించారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగింది. క్రికెట్ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు సైతం తీవ్రంగా స్పందించారు. బీసీసీఐపై , ప్రస్తుత కెప్టెన్ శిఖర్ ధావన్ , తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం క్రైస్ చర్చ్ లోని ఓవల్ లో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో సైతం సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇవ్వలేదు.
వరుసగా విఫలం అవుతూ వస్తున్న రిషబ్ పంత్ కు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉండగా టీమిండియాలో ధావన్ , శుభ్ మన్ గిల్ , సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ , దీపక్ హూడా, సుందర్ , దీపక్ చాహర్ , ఉమ్రాన్ మాలిక్ , అర్ష్ దీప్ సింగ్ , చాహల్ ను ఎంపిక చేశారు.
Also Read : విమెన్ ఐపీఎల్ లో ఫ్రాంచైజీ ధర రూ. 400 కోట్లు