Kris Srikkanth : వరల్డ్ కప్ జట్టులో ఆ ఇద్దరికి నో ఛాన్స్
షాకింగ్ కామెంట్స్ చేసిన కె. శ్రీకాంత్
Kris Srikkanth : భారత క్రికెట్ జట్టు మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ సర్వ సభ్య సమావేశంలో 20 మందితో కూడిన వన్డే వరల్డ్ కప్ జట్టును రూపొందించిందని సమాచారం. ఇదిలా ఉండగా భారత్ వేదికగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే వరల్డ్ కప్ జరగనుంది.
ఇందుకు సంబంధించి ఇప్పటికే కీలకమైన ఆటగాళ్లను ఎంపిక చేసినా ముందస్తుగా బాగోదని బీసీసీఐ ప్రకటించ లేదు. గతంలో ఉన్న సెలెక్షన్ కమిటీ ప్రతిభ ఆటగాళ్లను పక్కన పెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సదరు కమిటీని బీసీసీఐ రద్దు చేసింది. కొత్తగా దరఖాస్తులు స్వీకరించింది.
త్వరలోనే సెలెక్షన్ కమిటీని ఎంపిక చేయనుంది. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లు భారత జట్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై ఎవరికి వారు అంచనా వేస్తున్నారు. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్(Kris Srikkanth) స్పందించారు. 20 మంది ఆటగాళ్లలో కీలక ఆటగాళ్లకు చోటు కల్పించక పోవడం విస్తు పోయేలా చేసింది.
విచిత్రం ఏమిటంటే శుభ్ మన్ గిల్ , శార్దూల్ ఠాకూర్ లకు చోటు దక్కక పోవచ్చని అంచనా వేశాడు శ్రీకాంత్. మీడియం పేసర్లలో బుమ్రా, మాలిక్ , అర్ష్ దీప్ సింగ్ , సిరాజ్ , షమీ ఉంటారని తెలిపాడు. కాగా కేరళ స్టార్ సంజూ శాంసన్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ కప్ తుది జట్టులో శాంసన్ తప్పక ఉంటాడని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశాడు కృష్ణమాచారి శ్రీకాంత్. శ్రీకాంత్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : పంత్ కు గాయం వార్నర్ కు పట్టం