China Says : నిఘా నౌక వల్ల ఎలాంటి ప్రమాదం లేదు – చైనా

ఏ దేశంపై నిఘాను ఏర్పాటు చేయ‌లేదు

China Says : శ్రీ‌లంక నౌకాశ్ర‌యానికి చేరుకున్న‌ త‌మ నిఘా నౌక-5 వ‌ల్ల ఏ దేశానికి ప్ర‌మాదం లేద‌ని ప్ర‌క‌టించింది డ్రాగ‌న్ చైనా. ఈ నౌక రావ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించింది భార‌త దేశం.

శ్రీ‌లంక ప్ర‌భుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. చైనా నౌక ఆగ‌స్టు 16న ఉద‌యం 8.30 గంట‌ల‌కు చేరుకుంది. తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

భార‌త దేశానికి చెందిన క్షిప‌ణుల ప్ర‌యోగాన్ని ఈ నౌక ద్వారా స్కానింగ్ చేస్తుంద‌ని ఆందోళ‌న చేస్తూ అభ్యంత‌రం తెలిపింది. దీనిపై చైనా(China Says) తీవ్రంగా స్పందించింది.

యువ‌న్ వాంగ్ -5 నౌక స‌ముద్ర శాస్త్రీయ ప‌రిశోధ‌న కార్య‌క‌లాపాలు అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు లోబ‌డి ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ నౌక వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని, శ్రీ‌లంక‌, ఇండియా, పాకిస్తాన్ లేదా ఇత‌ర ఏ దేశం ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదంటూ పేర్కొంది చైనా. త‌మ నౌక హంబ‌న్ తోట ఓడ రేవు వ‌ద్ద‌కు విజ‌య‌వంతంగా చేరుకుంద‌ని తెలిపింది.

త‌మ హైటెక్ ప‌రిశోధ‌న నౌక కార్య‌క‌లాపాలు ఏ దేశ భ‌ద్ర‌త‌ను ప్ర‌భావితం చేయ‌వని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఒక వేళ అనుమానం ఉన్న‌ట్ల‌యితే తమ షిప్ వ‌ద్ద‌కు ప‌రీక్షించు కోవ‌చ్చ‌ని సూచించింది చైనా(China Says).

ప్ర‌ధానంగా త‌మ నౌక ప‌ట్ల భార‌త్ , అమెరికా దేశాలు తీవ్ర అభ్యంత‌రాల‌ను లేవ‌నెత్త‌డాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి వాంగ్ వెన్ బిన్.

చైనా నుంచి శ్రీ‌లంక $51 బిలియ‌న్ల విదేశీ రుణం తీసుకుంది. 2017లో ఈ ఓడ రేవును 99 ఏళ్ల‌కు లీజుకు తీసుకుంది. అందుకే నిఘా నౌక‌ను ఏర్పాటు చేసింది చైనా.

Also Read : ఎన్నాళ్లీ ర‌క్త‌పాతం ఎందుకీ ఘోరం

Leave A Reply

Your Email Id will not be published!