Narottam Mishra Pathan : పఠాన్ చిత్రం మారిన స్వరం
నిరసన తెలపాల్సిన అవసరం లేదు
Narottam Mishra Pathan : షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే కలిసి నటించిన పఠాన్ మూవీపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రధానంగా ఇందులో చిత్రీకరించిన బేషరమ్ సాంగ్ లో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ ఆందోళన నెలకొంది. మొదటగా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా(Narottam Mishra).
ఇదిలా ఉండగా ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలపై జోక్యం చేసుకోవద్దంటూ కోరారు. అతిగా స్పందించడం వల్ల పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు.
ఇక సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆపై సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను, పాటను రీ షూట్ చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా పఠాన్ మూవీకి భారీ ఎత్తున కలెక్షన్లు వస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు.
ఇకపై పఠాన్ పై నిరసన వ్యక్తం చేయడంలో అర్థం లేదన్నారు . ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ , భోపాల్ లలో కొన్ని థియేటర్లలో మార్నింగ్ షోలను రద్దు చేశారు. సెన్సార్ బోర్డు దిద్దుబాటు చేసింది. వివాదాస్పద పదాలను తొలగించారు. ఇప్పుడు నిరసన చేయాల్సిన అవసరం లేదన్నారు నరోత్తమ్ మిశ్రా(Narottam Mishra).
సినిమాపై ఇంకా నిరసనలు తెలుపుతున్న వారికి కౌన్సెలింగ్ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read : బండి సన్మానం రాహుల్ ఆనందం