Telangana DSC: షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణ డీఎస్సీ ! ఎలాంటి మార్పు లేదు !

షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణ డీఎస్సీ ! ఎలాంటి మార్పు లేదు !

Telangana DSC: తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ(DSC) పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఇటీవలే టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి సమయం సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు సోమవారం ఉదయం లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు.ఈ నేపథ్యంలోనే డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రకటన వెలువడటం గమనార్హం.

Telangana DSC – డీఎస్సీని వాయిదా వేయాలని ఆందోళన ! విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత !

హైదరాబాద్ నగరంలోని విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీని వాయిదా వేయాలని లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. ఇటీవల టీజీపీఎస్సీ నిర్ణయించిన హాస్టల్ వెల్ఫేర్, డీఏవో పరీక్షలను రాసినట్లు తెలిపారు. వరుసగా పోటీ పరీక్షలు ఉండటంతో చదవడానికి సమయం లేదని చెప్పారు. టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో పూర్తి చేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. టెట్ ఫలితాలు తాజాగా విడుదలైన కారణంగా కొంత కాలం డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల నియామకాలు పూర్తయ్యే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్యాలయ ముట్డడికి యత్నించిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.

Also Read : Cement Factory Accident: సిమెంట్‌ కంపెనీ ప్రమాద బాధితులకు మెరుగైన ఆర్థిక సాయం !

Leave A Reply

Your Email Id will not be published!