Economics Nobel Prize : ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

ప్ర‌క‌టించిన నోబెల్ అవార్డు సంస్థ‌

Economics Nobel Prize : ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారాలుగా భావించే నోబెల్ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది స్వీడీస్ సంస్థ‌. ఇప్ప‌టికే భౌతిక శాస్త్రం, సాహిత్యం, మాన‌వ హ‌క్కులు, త‌దిత‌ర వాటికి నోబెల్ బ‌హుమ‌తులు ప్ర‌క‌టించారు. తాజాగా బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై ప‌రిశోధ‌న‌ల‌కు గాను ముగ్గురు ఆర్థిక వేత్త‌ల‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తి (Economics Nobel Prize) ల‌భించింది.

ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ఈ ఏడాది 2022 కింద ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త‌లుగా గుర్తింపు పొందిన బెన్ బెర్నాంకే, డ‌గ్ల‌స్ డైమండ్ , ఫిలిప్ డైబ్విగ్ ల‌కు ల‌భించింది. సోమ‌వారం స్టాక్ హోమ్ లోని రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ లో ఆర్థిక శాస్త్రానికి నోబెల్ బ‌హుమ‌తిని బెన్ ఎస్ , బెర్నాంకే, డ‌గ్ల‌స్ డ‌బ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్ డైబిగ్వ్ కు ప్ర‌దానం చేశారు.

బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు చేసినందుకు గాను ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా గ‌త సంవ‌త్స‌రం 2021న డేవిడ్ కార్డ్ క‌నీస వేత‌నం , ఇమ్మిగ్రేష‌న్ , విద్య‌, కార్మిక మార్కెట్ ను ఎలా ప్ర‌భావితం చేస్తాయ‌నే దానిపై చేసిన ప‌రిశోధ‌న‌కు నోబెల్ ల‌భించింది.

సాంప్ర‌దాయ శాస్త్రీయ ప‌ద్ద‌తుల‌కు సుల‌భంగా స‌రిపోని స‌మ‌స్య‌ల‌ను ఎలా అధ్య‌యనం చేయాలో ప్ర‌తిపాదించినందుకు జాషువా ఆంగ్రిస్ట్ , గైడో ఇంబెన్స్ ఈ వార్డును పంచుకున్నారు.

ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాప‌కార్థం స్వీడిష్ సెంట్ర‌ల్ బ్యాంకు స్థాపించిన ఈ అవార్డు ఈ ఏడాదికి నోబెల్ బ‌హుమ‌తి ప్ర‌క‌ట‌న‌ల‌లో ఇది చివ‌రిది. అక్టోబ‌ర్ 3న స్వీడిష్ శాస్త్ర‌వేత్త స్వాంటే పాబో నియాండ‌ర్త‌ల్ డీఎన్ఏపై చేసిన కృషికి వైద్యంలో అవార్డును అందుకోవ‌డంతో ప్రారంభ‌మైంది.

Also Read : ర‌సాయ‌న శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

Leave A Reply

Your Email Id will not be published!