Annie Ernaux : అన్నీ ఎర్నాక్స్ కు సాహిత్యంలో నోబెల్

2022 సంవ‌త్స‌రానికి ఫ్రెంచ్ ర‌చ‌యిత‌

Annie Ernaux : ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన అవార్డుగా ప‌రిగ‌ణించే నోబెల్ ప్రైజ్ సాహిత్య విభాగంలో గురువారం ప్ర‌క‌టించింది స్వీడిష్ కు చెందిన నోబెల్ సంస్థ‌. 2022 సంవ‌త్స‌రానికి గాను నోబెల్ అవార్డుకు సంబంధించి సాహిత్యంలో విశేష‌మైన కృషి చేసినందుకు గాను ఫ్రెంచ్ ర‌చయిత్రి అన్నీ ఎర్నాక్స్ కు ల‌భించింది.

ఇందుకు సంబంధించి అధికారికంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది నోబెల్ సంస్థ‌. స్టాక్ హోమ్ లోని స్వీడిష్ అకాడ‌మీలో అన్నీ ఎర్నాక్స్ కు ఇస్తున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు ఈ పుర‌స్కారాన్ని ఆమెకు అంద‌జేశారు.

అన్నీ ఎర్నాక్స్(Annie Ernaux) కు వ్య‌క్తిగ‌త జ్ఞాప‌క‌శ‌క్తి మూలాలు, విడ‌దీయ‌డం, సామూహిక ప‌రిమితుల‌ను వెలితీసిన ధైర్యం ప్ర‌ద‌ర్శించినందుకు త‌న ర‌చ‌న‌ల్లో ఆమెకు సాహిత్య ప‌రంగా కృషి చేసినందుకు అవార్డు ఇచ్చిన‌ట్లు తెలిపింది.

ఇక 2021లో టాంజానియాలో జ‌న్మించిన యుకె ఆధారిత ర‌చ‌యిత అబ్దుల్ ర‌జాక్ గుర్నా వ‌ల‌స ప్ర‌భావంపై దృష్టి సారించాడు. వ‌ల‌స‌వాదం ప్ర‌భావాలు, సంస్కృతుల మ‌ధ్య అగాధంలో ఉన్న శ‌ర‌ణార్థుల విధిపై రాజీ లేని , క‌రుణతో నిండేలా త‌న ర‌చ‌న‌ల్లో ప్ర‌తిఫ‌లించేలా చేశారంటూ నోబెల్ బ‌హుమ‌తి కమిటీ పేర్కొంది. ఇదిలా ఉండ‌గా 2020లో నోబెల్ బ‌హుమ‌తిని(Nobel Prize) యుఎస్ క‌వి లూయిస్ గ్ల‌క్ కు అందించారు.

మ‌రో వైపు నోబెల్ సాహిత్య క‌మిటీ పేరుతో లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు స్వీడీష్ అకాడ‌మీని కుదిపేశాయి. దీంతో నోబెల్ సాహిత్య బ‌హుమ‌తిని 2018లో వాయిదా ప‌డింది.

నియాండ‌ర్త‌ల్ డీఎన్ఐపై చేసిన కృషికి గాను స్వీడిష్ శాస్త్ర‌వేత్త స్వంటే పాబో మెడిసిన్ లో అవార్డును స్వీక‌రించ‌డంతో నోబెల్ బ‌హుమ‌తి సోమ‌వారం నుండి ప్రారంభ‌మైంది.

Also Read : చ‌త్తీస‌గ‌ఢ్ ఒలింపిక్స్ లో గిల్లీ దండ‌

Leave A Reply

Your Email Id will not be published!