North East Results Comment : ‘ఈశాన్యం’ నేర్పిన పాఠం
ప్రజల తీర్పు శిరోధార్యం
North East Results Comment : ఈశాన్య ప్రాంతంలోని మూడు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. ఇదే సమయంలో ఉప ఎన్నికలు కూడా జరిగాయి. మహారాష్ట్ర, తమిళనాడులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
కానీ ఇదే పార్టీ త్రిపుర, నాగాలాండ్ , మేఘాలయలలో ప్రభావం చూపలేక(North East Results) పోయింది. అదే క్రమంలో కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించ లేక పోవడం కూడా గమనించాల్సి ఉంది. ఏది ఏమైనా పూర్తి మెజారిటీ అన్నది లేక పోవడం ప్రజాస్వామ్యానికి ఒకందుకు మంచిదే.
ఎందుకంటే వరుసగా ప్రజలు పాలక పార్టీకి పట్టం కడుతూ పోతే అది డెమోక్రసీ అనిపించుకోదు. దాని స్థానంలో రాచరికం పెచ్చరిల్లుతుంది. త్రిపురలో సుదీర్ఘ కాలం పాటు కొలువు తీరిన వామక్షపాలకు బీజేపీ షాక్ ఇచ్చింది.
ఈసారి కమ్యూనిస్టులు, కాంగ్రస్ కలిసి పోటీ చేసినా జనం ఎందుకో నమ్మలేక పోయారు. తిరిగి బీజేపీ సంకీర్ణానికి పట్టం కట్టారు. ఇక మేఘాలయలో మరోసారి నేషనల్ పీపుల్స్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించింది.
అక్కడ కొన్రాడ్ సంగ్మా సారథ్యలో ని ఆ పార్టీ తిరిగి పవర్ లోకి రానుంది. 26 సీట్లు వచ్చినా ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 5 సీట్లు కావాల్సి ఉంది. ఈసారి ఊహించని రీతిలో టీఎంసీ సత్తా చాటింది. కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 2 సీట్తో సరి పెట్టుకుంది.
ఇక మేఘాలయ సరేసరి. ఇక్కడ కూడా బీజేపీ అలయన్స్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల ఫలితాలను ఆధారంగా చేసుకుని రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలను అంచనా వేయలేం.
మూడు రాష్ట్రాలకు కలిపి 180 సీట్లు. ఒక్కో రాష్ట్రంలో 60 సీట్లు ఉన్నాయి. ఇక నాగాలాండ్ లో సీనియర్ భాగస్వామిగా ఉన్న నేషనిలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో కలిసి మెజారిటీ సాధించింది. దీన్ని బట్టి చూస్తే ఎక్కడా బీజేపీ తాను స్వంతంగా పవర్ లోకి రాలేక పోయిందన్నది గమనించాలి.
ఇక భారత్ జోడో యాత్రతో పుంజుకున్నట్లు అనిపించిన కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేక పోవడం గమనించాల్సిన విషయం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది.
కానీ తాను అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో పవర్ ను కోల్పోయింది. ఇక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. ఇదే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి పవర్ లోకి రావాలని బీజేపీ ట్రై చేస్తోంది.
కానీ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో ఏకంగా రూ. 6 కోట్లు పట్టుబడ్డాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఓ కాంట్రాక్టర్ లంచం ఇచ్చుకోలేనంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదే విషయాన్ని లేఖ ద్వారా తెలియ చేశాడు. మొత్తంగా ఈశాన్యంలో జరిగిన ఎన్నికల్లో (North East Results Comment) బీజేపీ తాము విజయం సాధించామన్న విషయాన్ని దేశానికి తెలియ చేయడంలో సక్సెస్ కాగలిగారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు మిగతా పార్టీలు ఏ రకంగా ముందుకు వెళతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇకనైనా ఒకే వేదికపైకి కలిసి వస్తే ఏమైనా ఫలితం ఉంటుంది. లేక పోతే మరోసారి బీజేపీకి తామంతకు తామే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని గమనించాలి. ఒంటరిగా కంటే కలిసి ఉంటేనే సక్సెస్ సాధించగలమని విపక్షాలు గుర్తిస్తే బెటర్.
Also Read : పేదరికం పేరుతో రాజకీయం చేశారు