Niharika Konidela : నాగ‌బాబు కూతురు నిహారిక‌కు నోటీసులు

కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసిన టాస్క్ ఫోర్స్

Niharika Konidela : తెలంగాణ ఇప్పుడు డ్రగ్స్ కు అడ్డాగా మారింది. కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇలాంటి అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు కేరాఫ్ గా మార‌డం విడ్డూరంగా ఉంది. ఇక ఇవాళ అర్ధ‌రాత్రి 3.30 గంట‌ల స‌మ‌యంలో టాస్క్ ఫోర్స్ దాడుల‌తో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది.

మొత్తం 150 మంది యువ‌తీ యువ‌కులు ప‌ట్టుబ‌డ్డారు. వీరిలో సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు కూతురు నిహారిక(Niharika Konidela) కూడా ఉండ‌డం విశేషం. బ‌య‌ట‌కు నీతులు వళ్లిస్తూ వ‌చ్చే వారి పిల్ల‌లు ఇలా ప‌ట్టుబ‌డ‌డం విచార‌క‌రం.

ప‌బ్ లో డ్ర‌గ్స్ – కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కిటికీల బ‌య‌ట విసిరేసిన ప్యాకెట్ల‌ను గుర్తించారు. ఇక నిహారిక‌తో పాటు టీడీపీ ఎంపీ కొడుకు, మాజీ ఎంపీ కుమారుడుతో పాటు ప్ర‌ముఖుల పిల్ల‌లు కూడా ఉన్నార‌ని స‌మాచారం.

చాలా సేపు నిహారిక‌ను విచారించారు పోలీసులు. ఆ త‌ర్వాత వ‌దిలేశారు. ఆమెకు నోటీసులు ఇచ్చారు. మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా ప‌బ్ విష‌యం గురించి తెలిసినా పోలీసులు ఎందుకు ప‌ట్టించు కోలేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. గ‌తంలో స్థానికులు ఫిర్యాదు చేసినా ప‌ట్టించు కోక పోవ‌డం , ప్ర‌స్తుతం దాడుల‌కు దిగ‌డంతో ఒక్క‌సారిగా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

ఈ ప‌బ్ మాజీ ఎంపీ కూతురుది కావ‌డంతో పోలీసులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. మ‌రో వైపు న‌టి హేమ సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

తాను లేకున్నా త‌న పేరు ఎలా చెబుతారంటూ ప్ర‌శ్నించారు. ఇంకో వైపు మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ త‌న కొడుకు ను కావాల‌ని ఇరికించారంటూ ఆరోపించారు.

Also Read : 10న ‘స్టార్ మా’లో ‘అఖండ’ మూవీ

Leave A Reply

Your Email Id will not be published!