AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఏపీలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 ఎంపీటీసీ 2 జడ్పీటీసీ, 2 సర్పంచ్ స్థానాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. దీనితో రామకుప్పం, కారంపూడి, విడవలూరు ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు (AP Local Body Elections) జరుగబోతున్నాయి. ఇక, ఇదే క్రమంలో కొండపూడి, కడియపులంక గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతాయి.
జూలై 30 నుండి ఆగష్టు 1 వరకూ నామినేషన్ల స్వీకరణకు అనుమతిస్తారు. ఆగస్టు 12న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనుండగా, ఆగస్టు 14న ఏపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆగస్టు 10న సర్పంచ్ ఎన్నికలు … ఉండగా, అదే రోజున ఫలితాలు విడుదల చేస్తారు.
AP Local Body Elections – ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్‌మీటర్లు బిగించొద్దు – మంత్రి గొట్టిపాటి
ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్‌మీటర్లు బిగించొద్దని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజామోదం లేనిదే ఏ విషయంలోనూ ముందుకు వెళ్లకూడదన్నారు. విశాఖపట్నంలో విద్యుత్‌శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్‌మీటర్లు బిగించనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయానికి వీటిని బిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్మార్ట్‌మీటర్లపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీఎం సూర్యఘర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని.. ప్రతి నియోజకవర్గంలో 10 వేల కనెక్షన్లు ఇవ్వాలన్నారు. శ్రీకాకుళ, విజయనగరం జిల్లాల్లో లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.
Also Read : CM Chandrababu: సింగపూర్ లో రెండో రోజు బిజీ బిజీగా సీఎం చంద్రబాబు
