NTR Death Anniversary : దివంగత సీఎం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు
తెలుగు వాడిని అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తెలుగు జాతిని తీసుకువచ్చారు...
NTR : దివంగత సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించారు. ఎన్టీఆర్(NTR) తెలుగుజాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే.. అవార్డుకే వన్నె వస్తుందన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. ఈరోజు ఏపీ మంత్రి నారా లోకేష్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పంచనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కు నివాళి అర్పించనున్నారు.
NTR Death Anniversary..
తెలుగు వాడిని అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తెలుగు జాతిని తీసుకువచ్చారు. ఎన్టీఆర్ చాలా మందిలో రాజకీయ ఆసక్తిని పెంచారు. ఆయన హయాంలో సాహాసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. మండల వ్యవస్థతో ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చారు. మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన వాటా కల్పించారు. మూడు రూపాయలకే కిలో బియ్యం ఘనత ఆయనదే. ఏ పాత్రలో నటించినా దానికి జీవం పోశారు అని అన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళి అర్పించిన లక్ష్మీపార్వతి కన్నీటిపర్యంతం అయ్యారు. తనను టీడీపీ నాయకులు మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఓ వ్యక్తినే కదా అని అన్నారు లక్ష్మీపార్వతి. ఆడవాళ్లను వేధించడం మంచిదా అని ఆమె ప్రశ్నించారు.
Also Read : Kolkata Doctor Case : ఆర్జీ కర్ హాస్పిటల్ లో డాక్టర్ హత్య కేసులో నేటి తీర్పుపై తీవ్ర ఉత్కంఠ